బాల్య వివాహం అడ్డగింత
Published Wed, Sep 11 2013 4:52 AM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: నగరంలోని పేర్నమిట్టలో జరుగుతున్న బాల్య వివాహాన్ని చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్.. పోలీసుల సహకారంతో సోమవారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. కొత్తపట్నం మండలం గాదెపాలేనికి చెందిన 15 ఏళ్ల బాలికను పేర్నమిట్టలోని బుట్టి కృపానందంకు ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు సిద్ధమయ్యారు.
ఛైల్డ్‌లైన్‌కు సమాచారం అందడంతో బీవీ సాగర్ విషయాన్ని ఎస్పీ ప్రమోద్‌కుమార్, తాలూకా సీఐ శ్రీనివాసన్‌ల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల సహకారంతో వరుడి ఇంటి వద్ద జరుగుతున్న బాల్య వివాహాన్ని సాగర్ అడ్డుకున్నారు. అనంతరం బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఎన్‌వీఎస్ రామమోహన్ ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా తమ కుమార్తె మేజర్ అయ్యేవరకు పెళ్లి చేయబోమని తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా తీసుకున్నారు.
Advertisement
Advertisement