నయవంచన | child marriage in ysr district | Sakshi
Sakshi News home page

నయవంచన

Published Wed, Feb 4 2015 4:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

child marriage in ysr district

కడప రూరల్: తాను చదివిస్తానంటూ నమ్మబలికి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకొని ఆ తర్వాత చదువుకునేందుకు అడ్డంకులు సృష్టించిన భర్తపై ఆ బాలిక తిరుగుబాటు చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మన్నూరు ఎస్‌ఐ సుధాకర్ కథనం మేరకు.. నందలూరు మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీలోని బాలరాచపల్లెకు చెందిన 20 ఏళ్ల యువకుడు రాజశేఖర్‌రాజు 8 నెలల క్రితం పుల్లంపేట మండలం ఎస్‌ఆర్‌పాళెంలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను భార్యను బాలరాచపల్లె నుంచి పాఠశాలకు వెళ్లి రావాలని షరతు విధించాడు.

అయితే ఆ అమ్మాయి తాను అంతదూరం వెళ్లి చదువుకోలేనని మొండికేసింది. తన తల్లి ఊరు అయిన నందలూరులో ఉండి చదువుకుంటానని తేల్చిచెప్పింది. అందుకు భర్త అంగీకరించలేదు. చదువుకోవాలనే తపన కలిగిన మైనర్ బాలిక 1098కి ఫోన్ చేసిన సమాచారం ఇచ్చింది. దీంతో ఆ సమాచారంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయమ్మ, ఎస్‌ఐ పి.సుధాకర్, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డిలు అమ్మాయిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ విచారణలో ఆమె తాను చదువుకుంటానని పేర్కొంది. దీంతో ఆమెను బాలసదన్‌లో చేర్చారు. అనంతరం బాల్యవివాహం చేసుకున్న రాజశేఖర్‌రాజుపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement