ప్రకాశం(దొనకొండ): పరిశ్రమల స్థాపన కోసం చైనాకు చెందిన డెలియన్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధి బృందం ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించింది. బృందంలో చైనాకు చెందిన డెలియన్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధి మాథ్యూ ఎబార్డ్, ఏపీఐఐసీ ఎండీ సత్యనారాయణ, ఢిల్లీ ఎకనమిక్ డెరైక్టర్ రాజేందర్, ఢిల్లీ ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధి సిద్ధార్థ ఆనంద్‌లు బృందంగా హెలీకాఫ్టర్‌లో దొనకొండకు వచ్చారు.
అధికారులను అడిగి భూముల రికార్డులను, మండల మ్యాపును పరిశీలించారు. మండలంలోని రుద్రసముద్రం, రాగమక్కపల్లి, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి ప్రాంతాల్లో భూములను స్వయంగా పరిశీలించారు. అనంతరం నెల్లూరు జిల్లాకు వెళ్లారు.
దొనకొండలో చైనా బృందం పర్యటన
Published Fri, Jul 3 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement