CHina team
-
చైనానూ చుట్టేసి...
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్‌తో భారత్ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. లీగ్‌లో టాప్ ర్యాంక్ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్‌తో జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్ చేసి 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మరోవైపు చైనా జట్టు 22 గోల్స్ చేసి, 4 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ కొరియా జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. -
పొగాకు రైతుకు కోవిడ్ దెబ్బ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చైనాలో ప్రబలిన కోవిడ్ (కరోనా) మన పొగాకు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది చైనా బృందం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించి సాగులో ఉన్న పొగాకు పంటలను పరిశీలించి వెళ్లింది. దీంతో రైతుల్లో చైనాకు ఎగుమతులు మెరుగుపడతాయన్న ఆశలు చిగురించాయి. ఇంతలో చైనాలో కోవిడ్ విజృంభించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. సకాలంలో వర్షాలు పడటంతో మంచి దిగుబడి, ఎగుమతులు సాధించవచ్చని ఆశించిన రైతులు కోవిడ్ ప్రభావంతోపాటు దేశంలోనూ సరైన ధర లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యలో అధిక వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో పొగాకు కోత కోయకుండానే పండుగుల్ల ఆకును వదిలేయాల్సిన దుస్థితి రైతులకు ఎదురైంది. ఈ ఏడాది ముందుగానే ప్రారంభించినా.. గతేడాది పొగాకు క్రయవిక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది వేలాన్ని ముందుగానే ప్రారంభించింది.. పొగాకు బోర్డు. ఫిబ్రవరి 17 నుంచే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు వేలం ప్రారంభమైంది. గతేడాది తొలి విడతలో మార్చి 22 నుంచి, రెండో విడతలో మార్చి 27 నుంచి వేలాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో దక్షిణాది తేలిక నేలలు, నల్లరేగడి నేలల్లో కలిపి పది మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అదనంగా వచ్చింది. 2019–20 పొగాకు ఉత్పత్తి లక్ష్యం 84 మిలియన్ కిలోలు కాగా ఈ ఏడాది 94.21 మిలియన్ కిలోల పొగాకు దిగుబడి వచ్చినట్లు పొగాకు బోర్డు అంచనాకు వచ్చింది. గతేడాది తీవ్ర వర్షాభావంతో అధిక వ్యయాన్ని భరించి మరీ పొగాకు సాగు చేస్తే ఒక్కో బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు మేర రైతులకు నష్టం వాటిల్లింది. గతేడాది అత్యధికంగా కిలోకు రూ.167.75 వచ్చింది. ఈ ఏడాది ఈ మొత్తానికి పది శాతం కలిపి ప్రారంభ ధర కిలోకు రూ.184గా నిర్ణయించాలని వ్యాపారులను రైతులు వేడుకొన్నారు. దీనికి ఒప్పుకున్న వ్యాపారులు చివరకు వేలం కేంద్రంలోకి వచ్చేసరికి ధరను తగ్గించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పొగాకు బోర్డు నాణ్యమైన ఎఫ్–1 పొగాకుకు ప్రారంభ ధరను కిలోకు రూ.190గా నిర్ణయించింది. అయితే వ్యాపారులు రూ.170 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యాపారుల సిండికేట్.. చైనా అధికారుల బృందం దేశంలో పర్యటించడంతో పొగాకు కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారుల్లో పోటీ పెరుగుతుందని రైతులు భావించారు. కోవిడ్ దెబ్బతో చైనా ఈ వైపు కన్నెత్తి చూడడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా తీసుకున్న ఇండియన్ టుబాకో అసోసియేషన్ తన పెత్తనాన్ని పొగాకు వేలంలో సాగించింది. అన్ని పొగాకు వ్యాపార సంస్థలు కలిసి ఇండియన్ టుబాకో అసోసియేషన్‌గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రైతులతో, పొగాకు బోర్డుతో చేసుకున్న ఒప్పందాలను వ్యాపారులు లెక్క చేయడం లేదు. వేలం కేంద్రాల్లో వ్యాపారులు పొగాకు బేళ్లను తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలం జరుగుతున్న ఆరు కేంద్రాల్లో శనివారం రైతులు 635 బేళ్లను తీసుకురాగా 150 బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరించారు. పూర్తి స్థాయిలో వ్యాపారులు పాల్గొనలేదు రెండు జిల్లాల్లో మొదటి విడతగా ఆరు కేంద్రాల్లో వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించారు. బోర్డులో రిజిస్టర్ చేసుకున్న వ్యాపారులందరూ వేలంలో పాల్గొనడం లేదు. దీంతో వేలం కేంద్రాలకు వచ్చిన అన్ని బేళ్లను కొనుగోలు చేయటం లేదు. దీంతో మిగిలిన బేళ్లను వెనక్కు తీసుకుపోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో చైనా వ్యాపారులెవరూ రాలేదు. – జి.ఉమామహేశ్వరరావు, పొగాకు బోర్డ్ ఆర్ఎం (ఎస్బీఎస్) నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి చైనా బృందం రాష్ట్రంలో పర్యటించినప్పుడు పొగాకుకు మంచి ధర వస్తుందనుకున్నాం. అయితే ఇంతలో కోవిడ్ దెబ్బ మన పొగాకు వ్యాపారంపై తీవ్రంగా పడింది. దీంతో ఇక్కడి వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. – మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
చైనాను నిలువరించిన భారత్
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్లో భారత మహిళల జట్టు 2–2తో పటిష్టమైన చైనా జట్టును నిలువరించింది. జూ వెన్జున్తో జరిగిన గేమ్‌ను హారిక, ప్రపంచ చాంపియన్ తాన్ జోంగితో జరిగిన గేమ్‌ను తానియా ‘డ్రా’ చేసుకోగా... కి గువోపై పద్మిని రౌత్ గెలిచింది. లీ తింగ్జీ చేతిలో ఇషా కరవాడే ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత జట్టు 2.5–1.5తో ఉక్రెయిన్‌పై గెలిచింది. ఆదిబన్ నెగ్గగా... శశికిరణ్, విదిత్, పరిమార్జన్ నేగి తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. -
'విశాఖ మీదుగా చైనాకు పట్టు మార్గం'
ప్రతిపాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా ఉప మంత్రి చెన్‌తో రాజధాని నిర్మాణంపై చర్చలు విజయవాడ: చైనా ప్రతిపాదిత సిల్క్ రూటును విశాఖపట్నం మీదుగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా బృందాన్ని కోరారు. కోల్‌కతా, చెన్నయ్‌లతో పోలిస్తే తూర్పుతీరానికి సరిగ్గా మధ్యభాగంలో ఉందని, మేరీటైమ్ సిల్క్ రోడ్డుకు ఈ రాష్ట్రం అన్నివిధాలుగా ఆకర్షణీయమైనదని ముఖ్యమంత్రి చైనా బృందానికి వివరించారు. పెట్టుబడులకు షాంగై తరువాత అమరావతిని సెకండ్ హోమ్‌గా భావించాలని ఆ బృందానికి సూచించారు. సోమవారం విజయవాడకు విచ్చేసిన చైనా ప్రభుత్వ ఇంటర్నేషనల్ డిపార్టుమెంటు ఉపమంత్రి చెన్ పెంగ్జిన్, మరో ఆరుగురు ప్రతినిధుల బృందంతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భారత్ పర్యటనలో తమ తొలి ప్రాధాన్యం ఏపీయేనని చైనా ఉపమంత్రి చెన్ పెంగ్జిన్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ఏపీ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
‘డ్రాగన్’ చేతికి భవానీ ద్వీపం
* పారిశ్రామిక టౌన్షిప్ ఏర్పాటు చేయించేందుకు సర్కారు యత్నం * చైనా బృందానికి ప్రత్యేక హెలీకాప్టర్ సమకూర్చిన వైనం సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా చోటు దక్కించుకున్న భవానీ ద్వీపాన్ని చైనాలోని అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ స్పేస్ డెవలపర్ డాలియన్ వాండా కంపెనీ చేతికి అప్పగించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. భవానీ ద్వీపాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వానికి వాండా గ్రూప్ ప్రతినిధుల పర్యటన కలిసొచ్చింది. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపంలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు వాండా గ్రూపు ప్రతినిధులు ఆసక్తి కనబరిచినట్లు అధికార వర్గాల సమాచారం. జూలై 15 నాటికి సింగపూర్ నుంచి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిన తర్వాత భవానీ ద్వీపాన్ని లీజుకిచ్చేందుకు సర్కారు పెద్దలు ఉద్యుక్తులవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆహ్వానంతో.... :ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో వాండా కంపెనీ ప్రతినిధుల్ని ఆహ్వానించారు. డాలియన్ వాండా గ్రూప్‌తో పారిశ్రామిక టౌన్షిప్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతోంది. వాండా గ్రూప్ పారిశ్రామిక టౌన్‌షిప్‌కు అనువైన స్థలం కోసం కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం మన రాష్ట్రానికీ వచ్చింది. దీంతో మాథ్యూ అబాట్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. గురువారం రాజధాని ప్రాంతంలోని అనంతవరం, నిడమర్రుతోపాటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం ప్రకాశం జిల్లా దొనకొండ, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని కత్తువపల్లి ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను పరిశీలించింది. భవానీ ద్వీపం ఏరియల్ వ్యూ కోసం ఏపీఐఐసీ, ఇన్‌క్యాప్ ఉన్నతాధికారులు హెలీకాప్టర్‌ను రప్పించారు. అందులోనే చైనా బృందం విజయవాడ నుంచి దొనబండ అటు నుంచి కృష్ణపట్నం పోర్టు అక్కడి నుంచి తిరుపతి వెళ్లింది. వాండాపైఆసక్తి తెలియజెప్పేందుకే చైనా బృందానికి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేసినట్లు తెలుస్తోంది. -
దొనకొండలో చైనా బృందం పర్యటన
ప్రకాశం(దొనకొండ): పరిశ్రమల స్థాపన కోసం చైనాకు చెందిన డెలియన్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధి బృందం ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించింది. బృందంలో చైనాకు చెందిన డెలియన్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధి మాథ్యూ ఎబార్డ్, ఏపీఐఐసీ ఎండీ సత్యనారాయణ, ఢిల్లీ ఎకనమిక్ డెరైక్టర్ రాజేందర్, ఢిల్లీ ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధి సిద్ధార్థ ఆనంద్‌లు బృందంగా హెలీకాఫ్టర్లో దొనకొండకు వచ్చారు. అధికారులను అడిగి భూముల రికార్డులను, మండల మ్యాపును పరిశీలించారు. మండలంలోని రుద్రసముద్రం, రాగమక్కపల్లి, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి ప్రాంతాల్లో భూములను స్వయంగా పరిశీలించారు. అనంతరం నెల్లూరు జిల్లాకు వెళ్లారు. -
చైనాకు పదోసారి సుదిర్మన్ కప్
డాంగ్వాన్ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన ప్రపంచ టీమ్ మిక్స్డ్ చాంపియన్‌షిప్ ‘సుదిర్మన్ కప్’లో చైనా జట్టు పదోసారి విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో చైనా 3-0 తేడాతో జపాన్ను ఓడించి వరుసగా ఆరోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకుంది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఫు హైఫెంగ్-జాంగ్ నాన్ 21-17, 20-22, 21-17తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావాలపై గెలుపొంది చైనాకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చారు. రెండో మ్యాచ్‌లో లీ జురుయ్ 23-21, 21-14తో అకానె యమగుచిని ఓడించగా... మూడో మ్యాచ్‌లో లిన్ డాన్ 21-15, 21-13తో టకుమా ఉయెదాపై నెగ్గి చైనా విజయాన్ని ఖాయం చేశాడు. 1989లో మొదలైన సుదిర్మన్ కప్‌లో చైనా 1995, 1997, 1999, 2001, 2005, 2007, 2009, 2011, 2013లలో చాంపియన్‌గా నిలిచింది. 2017 సుదిర్మన్ కప్‌కు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరం ఆతిథ్యమిస్తుంది. -
చైనాదే ఉబెర్ కప్
రన్నరప్ జపాన్ న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణించిన చైనా జట్టు 13వసారి మహిళల ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘ఉబెర్ కప్’ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా 3-1 తేడాతో జపాన్ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ 21-15, 21-5తో మినత్సు మితానిపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో మిసాకి-అయాకా (జపాన్) జోడి 21-18, 21-9తో యిక్సిన్ బావో-జిన్హువా తాంగ్ జంటను ఓడించి స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ 21-16, 21-12తో సయాకా తకహాషిపై నెగ్గి చైనాకు 2-1 ఆధిక్యాన్ని అందించింది. నాలుగో మ్యాచ్‌లో యున్లీ జావో-జియోలి వాంగ్ ద్వయం 21-13, 21-6తో మియుకి-రీకా జంటను ఓడించి చైనా విజయాన్ని ఖాయం చేసింది. ఫలితం తేలడంతో నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్స్‌లో ఓడిన భారత్, దక్షిణ కొరియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి. ఆదివారం పురుషుల విభాగంలో ‘థామస్ కప్’ కోసం మలేసియా, జపాన్ జట్లు పోటీపడతాయి.