హైదరాబాద్ : విరసం నేత వరవరరావు నివాసం ముందు విశాఖ జిల్లా చింతపల్లి గిరిజనులు బుధవారం ఆందోళనకు దిగారు. తాము మావోయిస్టుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. మావోయిస్టుల నుంచి తమను రక్షించాలని గిరిజనులు ఈ సందర్భంగా వరవరరావును కోరారు. కాగా విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో గతనెల 21వ తేదీన మావోయిస్టుల మీద గిరిజనులు తిరుగుబాటు చేసి.. ముగ్గురు నక్సలైట్లను హతమార్చిన విషయం తెలిసిందే.
మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్ పేరుతో ఒక గిరిజనుడిని హత్యచేసి, మరొకరిని శిక్షించేం దుకు ప్రయత్నించటంతో వారిపై ఆగ్రహించిన గిరిజనులు మూకుమ్మడిగా తిరుగుబాటు చేశారు. ఈ ఘటనలో మావోయిస్టు దళ డిప్యూటీ కమాండెంట్, మరో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనతో విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీ ఉద్రిక్తంగా మారింది. దాంతో మావోయిస్టుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారి నుంచి కాపాడాలని గిరిజనులు...వరవరరావుకు విజ్ఞప్తి చేశారు.
వరవరరావు ఇంటి వద్ద గిరిజనుల ఆందోళన
Published Wed, Nov 19 2014 10:11 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement