
పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి
కాకినాడ: వరద ప్రాంతాలలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి పడవ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయనకు ఏమీ కాలేదు. ఆయన సురక్షితంగా ఉన్నారు. తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చిరంజీవితోపాటు మరో ఇద్దరు నేతలు పడవ ఎక్కారు. ముగ్గురూ జారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే వారిని రక్షించారు. చిరంజీవి క్షేమంగా ఉన్నారు. ఈ పర్యటనలో చిరంజీవి వెంట కన్నబాబు, తోట నరసింహం కూడా ఉన్నారు.