Timmapuram
-
ప్రజల్లేని ఊరు.. తిమ్మాపూర్
నల్గొండ: రికార్డుల్లో రెవెన్యూ గ్రామమైన తిమ్మాపూర్లో నేడు ఒక్కరూ నివాసం లేకపోవడంతో ప్రజలు లేని పల్లెగా మారింది. 70 సంవత్సరాల క్రితం వ్యవసాయబావుల వద్ద ఐదు కుటుంబాలు (వంగాల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీరాంరెడ్డి, మధూసరెడ్డి, కుమ్మరి నర్సింహ) ఇళ్లు నిర్మించుకొని 60 సంవత్సరాల పాటు తిమ్మాపూర్ గ్రామంలో జీవనం సాగించారు. కాలక్రమంలో అంటువ్యాధులు ప్రబలి కొందరు ఊరు వదిలి పోగా మరికొందరు ఉపాధిని వెతుక్కుంటూ నెమ్మాని, పరడ, హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఏపీ లింగోటం, నార్కట్పల్లి, చిట్యాల, వెంకటేశ్వర్లబావి, శేరిబావి వంటి గ్రామాలకు వెళ్లి నివసిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పాడుబడిన ఇళ్లు, బావులు, పశువుల కొట్టాలు, గోడలు, పంట పొలాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఇలాంటి గ్రామాన్ని బేచిరాక్గావ్ (దీపం వెలగని గ్రామం)గా పిలుస్తుంటారు. గతంలో ఐదు కుటుంబాలు నివాసం.. 2011 జనాభా లెక్కల ప్రకారం తిమ్మాపూర్ గ్రామంలో 5 కుటుంబాలు నివసించేవి. గ్రామం మొత్తం జనాభా 20 మంది వారిలో 12 మంది పురుషులు, 8 మంది సీ్త్రలు ఉన్నారు. వీరిలో 9 మంది కూలీ పనులు చేసేవారిలో 8 మంది పురుషులు, ఒక సీ్త్ర ఉన్నారు. 55.56 శాతం అక్షరాస్యత కలిగిన గ్రామంలో ఇద్దరు మాత్రమే ఓటర్లు ఉండటం విశేషం. ఆంజనేయస్వామి విగ్రహం తరలింపు తిమ్మాపూర్లో గల ఆంజనేయస్వామి దేవాలయంలో గ్రామ ప్రజలు ఆంజనేయస్వామికి పూజలు చేసేవారు. అంటు వ్యాధులు ప్రబలడంతో గ్రామస్తులంతా ఒకరు తరువాత ఒకరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో గ్రామమంతా ఖాళీ అయ్యింది. దీంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం గ్రామస్తులు తీసుకెళ్లి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించుకున్నారు. తిమ్మాపూర్ పరిధిలో 500 ఎకరాలు.. కట్టంగూర్ మండంలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తిమ్మాపూర్. ఈ ఊరి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూములు ఉన్నాయి. కానీ ఆ ఊరిలో వరిసాగు, చెట్లు, పక్షులు, గేదెలు, పశువులు, భూమి తప్ప జనం కనిపించరు. ఆ గ్రామం పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తారు. వ్యవసాయ భూమి సాగు వివరాలు, ఇతర విషయాలు రికార్డుల్లో నమోదవుతాయి. గ్రామం రెవెన్యూ పరిధి కావడంతో సంబంధిత అధికారులే భూములను పర్యవేక్షిస్తారు. తిమ్మాపూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 59లో 500 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సుమారు 180 మంది రైతులు పత్తి, వరి, పెసర, కంది పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంగా పచ్చని పొలాల మద్య ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది. నెమ్మానిలో ఉంటున్నాం పరడ, నెమ్మాని గ్రామాల మధ్య తిమ్మాపూర్ ఉంటుంది. అక్కడే ఐదు కుటుంబాలు నివసించేవి. చుట్టూ చెట్లు కొండలతో అడవిని తలపించేలా ఉండేది. మా తాత, నాన్న అందరం 60 సంవత్సరాల పాటు జీవనం సాగించాం. ఇప్పుడు నార్కట్పల్లి మండలం నెమ్మానిలో నివాసం ఉంటున్నాం. పాస్ పుస్తకాల్లో రెవెన్యూ గ్రామం తిమ్మాపూర్, కట్టంగూర్ మండలం అని ఉండడంతో నార్కట్పల్లిలో ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది అవుతోంది. – వంగాల అనంతరెడ్డి, రైతు, నెమ్మాని -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం
-
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం తిమ్మాపురం ఏబీడీ రోడ్డు వద్ద ఓ లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ కూల్చివేతలు ఆపండి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు చెందిన ఇళ్ల కూల్చివేతను ఆపేయాలని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కలెక్టర్ యువరాజ్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 30 ఏళ్ల క్రితం మత్స్యకారులకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఇటీవల అధికారులు వాటిని దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ఈ నెల 21న బాధిత మత్స్యకారులు జిల్లా మంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని తెలిపారు. దీంతో మంత్రి స్పందించి ఇకమీదట మిగిలిన ఇళ్ల కూల్చివేత ఆపేయాలని అధికారులను ఆదేశిస్తానని, బాధితులకు కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంచాయతీ అధికారులు మాత్రం మిగిలిన ఇళ్లను కూల్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్ల కూల్చివేత ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకార నాయకులు, బాధితులు శనివారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
మీ పిల్లల బాధ్యత మాది
తిమ్మాపురం (కాకినాడ రూరల్) :తిమ్మాపురం గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాల విద్యార్థుల బాధ్యత తమదేనని వారి తల్లిదండ్రులకు అధికారులు భరోసా ఇచ్చారు. ముగ్గురు విద్యార్థులను కరస్పాండెంట్ విచక్షణారహితంగా కొట్టిన దారుణ ఘటన వెలుగుచూడడంతో తమ పిల్లలను తీసుకువెళ్లిపోవడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారులు సమావేశం నిర్వహించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటామని ఎంపీడీవో సీహెచ్కే విశ్వనాథరెడ్డి, తహశీల్దార్ జె.సింహాద్రి, ఎంఈవో ఎస్.విజయలక్ష్మిదేవి హామీ ఇవ్వడంతో పిల్లలను అక్కడే ఉంచేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పాఠాలు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను, ఆటపాటలు నేర్పేందుకు మరో ఉపాధ్యాయుడ్ని అధికారులు నియమించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, డీఈవో కేవీ శ్రీనువాసులురెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులను తరగతుల వారీ ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు నమోదు చేశారు. పాఠశాలలో ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని అధికారులు తెలిపారు. ‘గ్రీన్ఫీల్డ్’ను సందర్శించిన జెడ్పీ చైర్మన్ గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలను జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జెడ్పీ సీఈవో భగవాన్దాస్, డీఈవో కేవీ శ్రీనువాసులురెడ్డి మంగళవారం సందర్శించారు. ముగ్గురు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడంపై విచారణ జరుగుతుందని, ప్రభుత్వ ఆధీనంలో పాఠశాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్ రాంబాబు చెప్పారు. విద్యార్థులను పరామర్శించారు. -
పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి
-
నీటిలో పడిన చిరంజీవి
తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా కేంద్ర మంత్రి చిరంజీవి పడవ ప్రమాదానికి గురయ్యారు. -
పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి
కాకినాడ: వరద ప్రాంతాలలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి పడవ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయనకు ఏమీ కాలేదు. ఆయన సురక్షితంగా ఉన్నారు. తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిరంజీవితోపాటు మరో ఇద్దరు నేతలు పడవ ఎక్కారు. ముగ్గురూ జారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే వారిని రక్షించారు. చిరంజీవి క్షేమంగా ఉన్నారు. ఈ పర్యటనలో చిరంజీవి వెంట కన్నబాబు, తోట నరసింహం కూడా ఉన్నారు.