
బంగారుపాళెం/బుచ్చినాయుడు కండ్రిగ (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా బంగారుపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై తమకు ఉన్న అంతులేని అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తగ్గువారిపల్లెకు చెందిన రఘుపతిరాజు కుటుంబ సభ్యులు, నీర్పాకోట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని... మృతి చెందిన తమ తల్లిదండ్రులతోపాటు వైఎస్సార్ చిత్రపటం ముందు కూడా కొత్త బట్టలు పెట్టి పూజలు చేశారు. బంధువులు, స్నేహితులు తదితరులను పిలిచి బుధవారం మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రఘుపతిరాజు, సుబ్బలక్ష్మమ్మ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలు ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. మహానేత మృతి చెందినప్పుటి నుంచి ప్రతి సంక్రాంతి రోజు
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment