కేశవరెడ్డి గ్రూప్ నకు చెందిన స్కూళ్లపై సీఐడీ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల, అంపోలు, అరసవల్లిలోని స్కూళ్లపై ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు స్కూళ్లలోని రికార్డులతో పాటు.. బ్యాంక్ లావాదేవీలను తనిఖీ చేశారు. స్కూళ్ల నుంచి లభించిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం వరకూ విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బోధన కొనసాగాలని సిబ్బందికి సూచించారు. కాగా.. ఇక్కడి స్కూళ్లలో 2010 నుంచి విద్యార్థులకు సంబంధించిన డిపాజిట్లు ఇవ్వలేదని తేలింది.
కేశవరెడ్డి స్కూళ్లపై సీఐడీ దాడులు
Published Wed, Sep 16 2015 12:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement