సాక్షి, విజయవాడ : బెజవాడలో కొత్త ప్రభుత్వాస్పత్రి వద్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆటోనగర్ నుంచి రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ సిటీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటాన్నిగమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా ప్రాణాలతో బయపడ్డారు. చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
సిటీ బస్సులో మంటలు, దగ్ధం
Published Tue, Aug 29 2017 10:22 AM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
Advertisement
Advertisement