విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
గవర్నర్ పేట: విజయవాడలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గవర్నర్ పేటలోని భక్షి ఆటో మొబైల్ షోరూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో లూబ్రికెంట్లు, గ్రీజు, మండేందుకు సహకరించే పలు వస్తువులు ఉండటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో రంగప్రవేశం చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను నిలువరించాయి. కోట్లలో నష్టం చోటుచేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయ్యి ఉంటుందని ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు.