
మిగిలింది ఒక్క రోజే
920కి చేరిన నామినేషన్ల సంఖ్య
ఏలూరులో ముగిసిన స్వీకరణ పర్వం
మునిసిపాలిటీల్లో నేటితో ముగియనున్న గడువు
ఏలూరు, న్యూస్‌లైన్: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారం ముగిసిం ది. ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ము గియనుంది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 347 నామినేషన్ల దాఖలయ్యాయి. ఏలూరులో అత్యధికంగా 124 నామినేషన్ల దాఖలయ్యాయి. 291 కౌన్సిలర్/కార్పొరేటర్ పదవులకు ఇప్పటివరకు 920 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.గురువారం ఏలూరులో 124, భీమవరంలో 31, టీపీ గూడెంలో 64, పాలకొల్లులో 22, నరసాపురంలో 20, కొవ్వూరులో 24, నిడదవోలులో 14, తణుకులో 24, జంగారెడ్డిగూడెంలో 24 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.