కేంద్రం చేపట్టే ప్రాజెక్టులు పూర్తికావు | CM Chandrababu comments on Polavaram Project, congress party | Sakshi
Sakshi News home page

కేంద్రం చేపట్టే ప్రాజెక్టులు పూర్తికావు

Published Wed, Jul 26 2017 1:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కేంద్రం చేపట్టే ప్రాజెక్టులు పూర్తికావు - Sakshi

కేంద్రం చేపట్టే ప్రాజెక్టులు పూర్తికావు

సీఎం చంద్రబాబు వ్యాఖ్య
 
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రాజెక్టుల నిర్మాణం ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తికావని ముఖ్యమంత్రి చంద్రబాబు  వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి ఎందుకు అప్పగించారని రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రశ్నిచండంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం చేతిలో పోలవరం నిర్మాణ బాధ్యత ఉంటే అది ఎప్పటికీ పూర్తి అవ్వదనేది కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన ఇంటి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రం చేతిలో ఉన్న.. మీకు తెలిసి ఏదైనా ప్రాజెక్టు పూర్తయిందా. ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ఫోకస్‌ ఉండదు.

పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వకూడదని కాంగ్రెస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అడ్డుపడుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నపుడు వెంకయ్యనాయుడు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రానికి కొంత నష్టం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రపతి కోవింద్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement