శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు ఇబ్బడిముబ్బడిగా జిల్లాలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక సీఎంగా ఏడాదిలో ఐదు పర్యాయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజ లకు హామీలు గుప్పించారు. అంతే... ఇంతవరకు ఒక్క హామీ నెరవేరితే ఒట్టు. జిల్లా పాల కులు కూడా సీఎం ఇచ్చిన హామీలను పూర్తిగా మరచిపోయారు. పర్యటన సమయంలో ప్రజావ్యతిరేకత రాకుండా హామీలు గుప్పిం చడం, అనంతరం వాటిని విస్మరించడమే అలవాటుగా మారింది.
2014 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో తొలిసారిగా పర్యటించా రు. ఈ పర్యటనలో కేవలం ఒక ప్రవేటు ఫార్మా సంస్థను ప్రారంభించారు. స్థానికంగా పతివాడపాలెంలో గ్రామస్తులతో ముఖాముఖి ఏర్పాటుచేసినా ఫలితం శూన్యమే.
డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొ ప్పున జమచేస్తామని సభలో ప్రకటించారు. అనంతరం వాటిని రూ.3వేలకు పరిమితం చేశారు. అది కూడా జన్మభూమి కమిటీల్లో దశలవారీగా పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ఇచ్చిన వరకు మహిళలకు నమ్మకం కుదరని పరిస్థితి. 2014 అక్టోబర్ 15న హుద్‌హుద్ తుపాను ప్రభావంతో ముంపునకు గురైన పొందూరు మండలంలోని మొదలవలస, శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రాంతాలు పర్యటించారు. కింతలి మీదుగా వెల్లినా మొదలవలస గ్రామం పక్కనే ఉన్న రెల్లిగడ్డ వరదల నుంచి ఆ గ్రామాన్ని, అక్కడ పొలాలను రక్షించేందు కు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఆ తరువాత ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్‌లు రెల్లిగెడ్డ అభివృద్ధివైపు కన్నెత్తిచూడలేదు.
2014 అక్టోబర్ 23న శ్రీకాకుళం రూరల్ మండలంలో కుందువానిపేట గ్రామంలో హుద్‌హుద్ తుపాను బాధిత కుటుంబాలను పరామర్శించారు. తుపానుకు తట్టుకునేలా మత్య్సకారులకు శాశ్విత ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతే.. అక్కడతో ఆ హామీ గాలిలో కలిసిపోయింది. ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క ప్రతిపాదన కూడా చేయలేదు. స్థలాన్ని కూడా సేకరించ లేదు. 2015 ఫిబ్రవరి11న ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు తనయుని వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇది కూడా వ్యక్తిగతంగా నిలిచిపోయింది.
2015 ఫిబ్రవరి 14 నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. తీరా సగం మంది రైతులకు మొండిచేయి చూపారు. కొర్రీలతో కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. అదే రోజు చిలకపాలెంలో శివానీ ఇంజినీరింగ్ కళాశాలో విద్యార్ధులతో ముఖాముఖి చేపట్టారు. వ్యక్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఈ హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు.
వచ్చారు.. వెళ్లారు..!
Published Sun, Jun 7 2015 11:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement