జిల్లాలో ఉన్నవి దాదాపు ఏడులక్షల కుటుంబాలు ఊ ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏడు లక్షలు
నిరుద్యోగులు దాదాపు రెండు లక్షల మంది
రూ.2వేలు చొప్పున సంవత్సరానికి చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి రూ.48లక్షలు
జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు పదివేల మంది
జాబు రావాలంటే..బాబు రావాలి..ఇంటికో ఉద్యోగం ఇస్తాను.. నిరుద్యోగులకు భృతి చెల్లిస్తాను. నేను మారాను. నన్ను నమ్మండి. నన్ను గెలిపించండి. అంటూ ప్రతిపక్ష నేతగా ఏడాది క్రితం ప్రజల్లోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల సభల్లో తన ప్రచారంతో ఊదరగొట్టారు. అదే సమయంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతాం. మీ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తాం. అని భరోసా ఇచ్చారు. ఇదంతా నిజమేనని నమ్మిన ప్రజలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చంద్రబాబును ప్రతిపక్ష నేత స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థానానికి అందలం ఎక్కించార
దీంతో చంద్రబాబు స్థానం మారింది. అయితే ఆయన మారినప్పటికీ ఆయనతో పాటు ఆయన మనసు మాత్రం మారలేదు. రాష్ట్రం ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్నా ఒక్క ఉద్యోగం సైతం ఇవ్వకపోగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 86 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వ్యవసాయ విభాగంలో పనిచేసే ఆదర్శరైతులు 1538మందిని తొలగించారు. అంతేకాకుండా తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయోనని ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బితుబితుకు మంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకైనా ఇంటినుంచి భారం తగ్గుతుందని, చంద్రబాబు ఇచ్చే నిరుద్యోగ భృతితో కాంపిటీషన్ బుక్స్ ఖరీదు చేసి చదువుకోవచ్చని భావించిన నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రజల ఆశలు ఆడియాసలే అయ్యాయి.
అబద్ధాల కోరు చంద్రబాబు
అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్న చంద్రబాబు అబ ద్ధాల ముఖ్యమంత్రిగా చరి త్రలో నిలిచిపోతారు. అయన చెప్పిన అబద్ధాల్లో నిరుద్యోగ యువతను మోసం చేయడానికి ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలా లేదు. విదేశీ కార్పొరేట్ శక్తుల మోచేతి నీళ్లు తాగుతూ కాలయాపన చేస్తున్నారు. త్వరలో టీడీపీ కోటకు బీటలు తప్పవు
-బుగత అశోక్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం. నిరుద్యోగులతో ప్రత్యేక పోరాటాలకు ప్రణాళిక రచిస్తున్నాం.
జి.అప్పలసూరి, ప్రభుత్వ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు