ఎల్.ఎన్.పేట: గోదావరి పుష్కరాలు ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారని, వీరి మరణానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే ఆ పాపం అని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆది వారం మండలంలోని పూశాం, కోవిలాం గ్రామాల్లో పర్యటించిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. షార్ట్‌ఫిలిం షూటింగ్ కోసం పుష్కర పుణ్యస్నానాలకు వచ్చిన ప్రజలకు గంటల కొద్ది నిల్చోబెట్టిన చంద్రబాబును ముద్దాయి చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మీడియాలో కనిపించాలన్న మైకంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, రూ.కోట్లు చెల్లించి మీడియాలో ప్రచారం చేసుకునే దుస్థితికి దిగజారడం రాష్ట్ర ప్రజల దురదృష్టంగా పేర్కొన్నారు.
పుష్కర యాత్రికులకు కనీసం తాగునీటిని కూడా చంద్రబాబు కల్పించలేకపోయారని, పుష్కర ఏర్పాట్ల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేసినట్లు చూపి ఇందులో అధిక మొత్తం దారిమళ్లించారని యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పోలీసులు పుష్కర స్నానాలకు వచ్చిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల సేవలో తరిస్తున్నారని, దీంతో యాత్రికుల ఇబ్బందులను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. జాతీయ రహదారిలో వాహనాలు బారులు తీరడం, తిరుగు ప్రయాణంలో ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడడం వంటి సంఘటనలన్నీ ప్రభుత్వ వైఫల్యాలేనని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందివ్వాల్సిన మంత్రుల ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు శివ్వాల కిశోర్‌బాబు, శివ్వాల అమ్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల మరణాల పాపం చంద్రబాబుదే
Published Sun, Jul 19 2015 11:51 PM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement