సర్కారు కొలువంటే చుక్కలు చూపెడుతున్నారు ‘చంద్ర’ బాబు నాయుడు. ఎన్నికల వేళ ఆకాశమంత హామీలిచ్చేసి తీరా పదవి చేపట్టాక ఆ మాటలన్నీ గాలి కబుర్లే అని తేల్చేశారు. జాబు గ్యారంటీ అన్న బాబు గద్దెనెక్కి ఏడాదైనా ఆ హామీ నిలబెట్టుకోలేదు. నిరుద్యోగ భృతి ఆశ చూపి ఇప్పుడు నీళ్లు నముల్తున్నారు. కష్టపడి చదువుకున్న చదువుకు పరమార్థంగా మేలైన ఉపాధి బాటపట్టాలన్నా యువత ఆకాంక్షలన్నీ ఆవిరైపోతున్నాయి.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎన్నికల్లో నిరుద్యోగులను ఆదుకుంటామని, బాబు వస్తే జాబ్ వస్తుందంటూ అక్కరకు రాని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏడాది పాలనతో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అంతేకాకుండా పలు శాఖల కాంట్రాక్టు ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఏడాదిగా ఒక్క నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత లక్షల సంఖ్యలో పడిగాపులు కాస్తున్నారు. వెలుగు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో నిరుద్యోగ యువత 56 వేలమంది వరకు ఉన్నారు. ఎంప్లాయిమెం టు కార్యాలయంలో నమోదు చేయించుకున్న వారు 49,241 మంది వరకు ఉన్నారు.
నిరుద్యోగ భృతిని విద్యార్హతను బట్టి నెలకు రూ. 2వేలకు తక్కువ లేకుండా అందజేస్తామని ఎన్నికల సమయంలో హమీలు గుప్పించి, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్నే పూర్తిగా మరి చారు. జిల్లాలో గ్రాడ్యుయేషన్, వివిధ రకాల వృత్తి విద్యా శిక్షలు పూర్తి చేసినవారు సుమారు లక్షమంది ఉన్నారు. వెలుగు ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో సేకరించిన నిరుద్యోగుల వివరాల ప్రకారం జిల్లాలో 55,790 మంది నిరుద్యోగులున్నారు.
వీరఘట్టం మండలంలో అధికంగా 2426 మంది, సీతంపేటలో 2509 మంది, సోంపేట 2724 మంది, శ్రీకాకుళం 2001, పాలకొండ 2412, కొత్తూరు 2123 బూర్జ 2193 మంది ఉన్నారు. జిల్లా ఎంప్లాయిమెంటు అధికారి వద్ద ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలో 49,241 మంది నమోదు చేయించుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో విద్యార్హతలు పదో తరగతి పాస్ నుంచి ఉన్నత చదువులు, వృత్తి విద్యా కోర్సులు చదివి ఉద్యోగం వస్తుందని ఆశతో నమోదు చేయించుకున్నారు. గత ఏడాదిగా ఈ శాఖ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. భవిష్యత్తులోనైనా తాము కష్టపడి సాధించుకున్న డిగ్రీలకు తగిన ఉద్యో గాలు కల్పించాలని యువత కోరుతోంది.
హామీలను విస్మరించారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వా త విస్మరించడం తగదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అవి లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు పలుమార్లు వాగ్దానాలు చేశా రు. ఇప్పుడు ఆ హామీలను అటకెక్కించారు. నిరుద్యోగులపై అభిమానం ఉంటే ఆయన ఇచ్చిన హామీలను అమలు పరచాలి.
- కోత సోమేశ్వరరావు, మూడు రోడ్ల జంక్షన్,
సంతబొమ్మాళి
ఉన్న ఉద్యోగాన్నే లాగేసుకున్నారు
కొత్త ఉద్యోగం మాట దేవుడెరుగు.. కానీ పాత ఉద్యోగాలనే తీసేస్తున్నారు. సహజ సేంద్రీయ వ్యవసాయం(ఎన్‌పీఎం) పథకంలో సీఏగా పని చేసేవాళ్ళం. ఏడాదిగా ఈ పథకం ఏమైందో తెలీదు. జీతాలు లేవు. ఏడాదిగా పాలన సాగిస్తున్న బాబు నిరుద్యో గులను చిన్న చూపు చూస్తున్నారు. ఇచ్చిన హామీలను విస్మరించారు. చదువుల్లో ప్రతిభ చూపుతున్న విద్యార్థినులకు ఉపాధి కల్పించాల్సి బాధ్యత ఆయనదే.
- కె. సత్యవతి, ఎన్‌పీఎం సీఏ, రాగోలు
నిరుద్యోగ భృతి ఏది?
ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యో గ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అటువంటిదేమీ లేదు. ఆదిమ గిరిజనులమైన మేమే బీఎస్‌సీ, బీఈడీలు చేసి ఖాళీగా ఉంటున్నాం. ఎటువంటి అవకాశా లు లేక అల్లాడుతున్నాం. గ్రూప్స్, పంచాయతీ సెక్రటరీలు, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల్లు, వీఆర్‌వో తదితర పోస్టులు భర్తీ ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా యువతకు న్యాయం చేయాలి.
- సవర కుమార్, బీఎస్‌సీ, బీఈడీ
నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలి
బాబు వస్తే జాబు గ్యారంటీ అం టూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత జాబు మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు.నిరుద్యోగులకు ఎటువంటి ఆసరా లేక అవస్థలు పడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రకారం నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలి.
- టి.సూర్యం, విద్యార్థి సంఘ నాయకుడు,
టెక్కలి
బాబూ..ఏదీ జాబు?
Published Mon, Jun 1 2015 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement