హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. అత్యంత అట్టహాసంగా జరుగనున్న రాజధాని శంకుస్థాపనకు హాజరవ్వాల్సిందిగా ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానపత్రికను అందించనున్నారు. అలాగే స్వచ్ఛ్ భారత్పై నీతి ఆయోగ్ నివేదికను కూడా ప్రధానికి సమర్పించనున్నారు. అనంతరం బుధవారం సాయంత్రం హోం మంత్రి రాజ్ నాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కలిసి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు.