
నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటి!
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దేశరాజధాని ఢిల్లీ లోని త్యాగరాజ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోడీని చంద్రబాబు కలిశారు. అయితే సమావేశం గురించి పూర్తి సమచారం అందుబాటులోకి రాలేదు. అయితే చంద్రబాబుతో పొత్తును జాతీయ నాయకులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు ఎలాంటి సానుకూల స్పందన రానట్టు తెలిసింది.
ఎలాంటి పరిస్థితిలోనైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బీజేపీ నుంచి అదే మొత్తంలో స్పందన రాకపోవడం చంద్రబాబుకు ఊహించని పరిణామంగా రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ రాష్ట్ర నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎన్నికల పొత్తుపై జాతీయ పార్టీ నేతలు జాగ్రత్తగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.