సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్‌లో పరీక్షించి రైతులకు అందజేయాలని కేబినెట్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 77 మండలాల్ల రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేటినెట్ నిర్ణయించింది. మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
Comments
Please login to add a commentAdd a comment