‘100 చదరపు గజాల ఇంటి రిజిస్ట్రేషన్‌ ఒక్క రూపాయికే’ | Minister Perni Nani Press Meet Over AP Cabinet Decisions | Sakshi
Sakshi News home page

‘100 చదరపు గజాల ఇంటి రిజిస్ట్రేషన్‌ ఒక్క రూపాయికే’

Published Wed, Oct 30 2019 5:17 PM | Last Updated on Wed, Oct 30 2019 6:28 PM

Minister Perni Nani Press Meet Over AP Cabinet Decisions - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ‘అమ్మ ఒడి’ పథకం వర్తిపంజేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. 77 మండలాల్ల రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు..

  • మాల, మాదిగ, రెల్లి.. ఇతర కులాల ప్రత్యేక కార్పొరేష్ల ఏర్పాటు ఆమోదం
  • గ్రామీణ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ ఆగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం
  • 147 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ ఆగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు
  • నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ల్యాబ్‌లో పరీక్షించి ఇవ్వాలని నిర్ణయం
  • కోస్తా జిల్లాలోని 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటుకు ఆమోదం
  • హజ్‌ జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపునకు ఆమోదం
  • దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
  • వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు
  • అవార్డుతోపాటు రూ.10 లక్షల బహుమతి
  • కృష్ణా-గోదావరి కాల్వల క్లీనింగ్‌ కమిషన్‌ ఏర్పాలు
  • ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం
  • రోబో శాండ్‌ తయారీ యంత్రాల కొనుగోలుకు తక్కువ వడ్డీ రుణాలు
  • అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి రెగ్యులరైజేషన్‌
  • 100 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం ఉంటే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌
  • 100 నుంచి 300 చదరపు గజాల వరకు మార్కెట్‌ ధరకే రిజిస్ట్రేషన్‌
  • హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకీ ఆమోదం
  • రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు డబ్బు చెల్లింపునకు నిర్ణయం
  • నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి నిర్ణయం
  • మత్స్యకారులకు ఆర్థిక సాయం, డీజిల్‌పై సబ్సిడీ పెంపుపై నిర్ణయం
  • న్యాయవాద సంక్షేమ నిధిపై చట్టంలో మార్పులకు నిర్ణయం
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని నిర్ణయం
  • పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంపు
  • జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన 498.3 ఎకరాల భూకేటాయింపు రద్దు
  • విశాఖలో లులు గ్రూపన్‌కు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement