సీమాంధ్ర ఉద్యమానికి బాధ్యుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాల ని ఎంపీలు మందా జగన్నాధం, వివేక్ డిమాండ్ చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ : సీమాంధ్ర ఉద్యమానికి బాధ్యుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాల ని ఎంపీలు మందా జగన్నాధం, వివేక్ డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారని, కిరణ్ ప్రాంతీయవాదిగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడా రు. జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కిరణ్‌పై మండిపడ్డారు.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ఆయన తర్వాత ప్రాంతీయవాదిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఉపఎన్నికలు చూస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. ఒక్క సీటూ గెలవలేని సీఎం కిరణ్ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళతారని ప్రశ్నించా రు. విభజనకు సానుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించడం అర్దరహితమన్నారు. ఎంపీ వివేక్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ కుమ్మకై తెలంగాణ అంశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.