సాక్షి, తాడేపల్లి: ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం ఆయన ఉన్నత విద్యపై సమీక్షించారు. ఈ సమావేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర పాల్గొన్నారు. కాలేజీల ఫీజుల ప్రతిపాదనలను ఏపీ హయ్యార్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముఖ్యమంత్రి ముందు ఉంచింది. మనం రూపొందించుకునే విధానాలు.. దీర్ఘకాలం అమలు కావాలని సీఎం పేర్కొన్నారు ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. (సీఎం జగన్‌తో జర్మన్ కాన్సులేట్ జనరల్ భేటీ)
చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాం..
ఫీజు రియింబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది బకాయిలతో పాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి, ప్రభుత్వం తరపున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మార్చి 30లోగా చెల్లింపులు చేసేందుకు ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు వల్ల కళాశాలలకు మంచి జరుగుతుందన్నారు. అందుకే స్థిరమైన ఫీజు విధానం ఉండాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
(ఓటమి విజయానికి తొలిమెట్టు : సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment