సాక్షి, విశాఖపట్నం: లాక్‌డౌన్‌తో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా సంక్షేమ పథకాల అమల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా మహిళా సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేసింది. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడారు. సున్నా వడ్డీ పథకం తమ కుటుంబాల్లో వెలుగులు నింపిందని డ్వాక్రా మహిళలు తెలిపారు. కష్ట కాలంలో అండగా నిలిచినందుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
విశాఖలోని ఆనందపురానికి చెందిన డ్వాక్రా మహిళ కె.పద్మావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా సీఎం వైఎస్ జగన్‌తో సంభాషించారు. కష్ట కాల సమయంలోనూ మాకు అండగా ఉన్నందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకానికి విశాఖ జిల్లాలో గ్రామీణ,పట్టణ ప్రాంతాలకు 64 కోట్లు విడుదల అయ్యాయి. వైఎస్సార్ సున్నా వడ్డీ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు.
అనకాపల్లి తుమ్మపాలలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో డ్వాక్రా సంఘం మహిళలకు 2 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను ప్రస్తుత విపత్తు పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ నిలుపుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తారని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా: కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డ్వాక్రా మహిళలతో మాట్లాడారు.
కృష్ణా జిల్లా: మైలవరం మండల మహిళా సమైక్య సాధికారిత కార్యాలయంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. నియోకజకవర్గంలోని మైలవరం, జి.కొండూరు, రెడ్డి గూడెం,ఇబ్రహీం పట్నం, విజయవాడ రూరల్‌లో ఆయా గ్రూప్ సంఘాలకు రూ.3.67 కోట్ల విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే అందించారు. పెడన నియోజకవర్గంలో స్వయం సహాయ సంఘాలకు 3 కోట్ల 13 లక్షల 55వేల 309 రూపాయల విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే జోగి రమేష్ అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా: జగ్గంపేటలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చెక్కులు పంపిణీ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పొదుపు సంఘాలకు రూ.4.90 కోట్ల విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గంలో ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 11 కోట్ల 33 లక్షల 68వేల రూపాయల విలువైన చెక్కులను డ్వాక్రా మహిళలకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనితా, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కన్నా పశ్చిమగోదావరి జిల్లా కు 166 కోట్ల రుపాయలను ప్రభుత్వం మహిళల సంఘాలకు కేటాయించిందని తెలిపారు. మంత్రి తానేటి వనితా మాట్లాడుతూ.. కరోనా వైరస్ పై ప్రపంచం అంతా పోరాటం చేస్తున్నా సమయంలో కుడా పొదుపు సంఘాల మహిళలకు పాదయాత్ర లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా మహిళలను ఆదుకుంటున్నారన్నారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ..కరోనా లాంటి విపత్తు ఉన్న సమయంలో కుడా మహిళలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ నిలబెట్టుకున్నారని తెలిపారు.
ప్రకాశం: జిల్లాలో 60 వేల పొదుపు సంఘాలకు 130 కోట్ల వడ్డీ రాయితీ చెక్కులను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ..90 లక్షల అక్కచెల్లెమ్మలకు 1400 కోట్లు ఇవ్వడం ఒక చరిత్ర అని తెలిపారు. మహిళలను చంద్రబాబు మోసం చేశారని...ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అండగా ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ తన పాలనలో మహిళలకు అగ్రపీఠం వేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment