‘కోడ్’పైనే గురి
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
జిల్లా నలుమూలలా చెక్‌పోస్టుల ఏర్పాటుకు కసరత్తు
పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
జిల్లా యావత్తూ అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి
సాధారణ ఎన్నికల కంటే ముందుగానే మునిసిపల్ ఎన్నికల కోడ్ కూసింది. షెడ్యూల్ ప్రకటించిన సోమవారం నుంచే తక్షణం అమల్లోకి రావడంతో కోడ్ ఉల్లం‘ఘనుల’పై జిల్లా యంత్రాంగం గురి పెట్టింది. ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలే కాకుండా జిల్లా మొత్తం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల కదలికలపై అధికారులు దృష్టి సారించారు.
సాక్షి, గుంటూరు
నిసిపల్ ఎన్నికల నేపథ్యంలో సామాజికంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, ప్రభుత్వ స్థలాల్లో గోడలపై రాతలతో పెద్ద ఎత్తున ప్రచారానికి నేత ములు దిగుతున్నారు. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచే జిల్లాకు చెందిన మంత్రులు మాజీలై సాధారణ పౌరులు కావడం, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వీల్లేదని, ఈ కార్యక్రమాలకు అధికారులు హాజరు కారాదని శనివారం రాత్రే జిల్లా కలెక్టరు సురేశ్‌కుమార్ ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా రెవెన్యూ అధికారులపైనే ఉందని కలెక్టరు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పరిషత్తు నుంచే సెట్ కాన్ఫరెన్స్‌లో మండల తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొత్తవి మంజూరు చేయరాదని, మంజూరైన పథకాల్ని తక్షణం గ్రౌండింగ్ చేయాలని కలెక్టరు సూచించారు.
పట్టణాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసే హోర్డింగులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని, ముందుగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత స్పందించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నియమావళి అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అధికారులపై ఫిర్యాదులు అందినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కలెక్టరు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గానే మునిసిపల్ ఎన్నికల్ని ఇటు రాజకీయ పార్టీలతో పాటు అటు అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్ని విజయవంతంగా పూర్తి చేసి సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని యోచిస్తోంది.
చెక్‌పోస్టులతో పటిష్ట బందోబస్తు
ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం సహకారం తప్పనిసరి.
జిల్లా నలుమూలల చెక్‌పోస్టుల ఏర్పాటు, నేరచరితులు, అనుమానితులు, బైండోవర్ కేసులు తదితర విషయాల్లో రెవెన్యూ, పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది.
{పతి పోలింగ్ స్టేషన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
చెక్‌పోస్టుల తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టుబడినా, కోడ్ ఉల్లంఘిస్తే వెంటనే కేసులు నమోదు చేసేందుకు రెవెన్యూ, పోలీస్ సంయుక్తంగా విధులు నిర్వహించాలి.
కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రతి చర్య వీడియో తీయించాలని, ఈ వీడియో చూసేందుకు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దరిమిలా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
హైదరాబాదు నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టరు, జేసీలు వివరించారు.
జిల్లాలో ఎన్నికలు జరిగే 12 పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితా ప్రకటించారు.
ఎన్నికల నిర్వహణకు సరిపడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) అందుబాటులో ఉన్నాయి.
మునిసిపాలిటీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లు యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేసి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఓటర్ల జాబితాలో అవకతవకలు నిరోధించేందుకు రిటర్నింగ్ అధికారులకు అధికారం ఇచ్చారు.