General Elections - 2014
-
టీఆర్ఎస్ మలి జాబితా
8 లోక్‌సభ, 4 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు నాగర్‌కర్నూల్‌లో మందా, వరంగల్‌కు కడియం నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డికి మల్కాజిగిరి అసెంబ్లీ కనకారెడ్డికి సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలోకి దింపే అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితాను టీఆర్ఎస్ శనివారం ప్రకటించింది. ఈ జాబితాలో ఎనిమిది లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ మందా జగన్నాథంను మళ్లీ నాగర్ కర్నూల్ నుంచే రంగంలో దింపారు. అలాగే వరంగల్ నుంచి కడియం శ్రీహరి, సికింద్రాబాద్ నుంచి తూం భీంసేన్ పోటీ చేయనున్నారు. శుక్రవారమే పార్టీలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. కాగా.. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతితో పాటు కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేర్లు ఈ జాబితాలో కూడా లేవు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని కనకారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆకుల రాజేందర్ పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లోక్‌సభ స్థానాలు నియోజకవర్గం అభ్యర్థి నాగర్‌కర్నూల్ మందా జగన్నాథం భువనగిరి బూర నర్సయ్యగౌడ్ మహబూబ్‌నగర్ ఏపీ జితేందర్‌రెడ్డి వరంగల్ కడియం శ్రీహరి కరీంనగర్ బి.వినోద్‌కుమార్ చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి నల్లగొండ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సికింద్రాబాద్ తూం భీం సేన్ అసెంబ్లీ స్థానాలు నియోజకవర్గం అభ్యర్థి నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ మల్కాజిగిరి సిహెచ్.కనకారెడ్డి షాద్‌నగర్ వై.అంజయ్య యాదవ్ కోదాడ కె. శశిధర్‌రెడ్డి -
నల్ల సూరీడే న్యాయ నిర్ణేత
జన పథం: సార్వత్రిక ఎన్నికల వేళ అందరి దృష్టి సింగరేణి కార్మికుడిపైనే. నాలుగు జిల్లాల పరిధిలో విస్తరిం చి ఉన్న సింగరేణి ‘కుటుంబం’ ఇప్పుడు ఎన్ని కలపై తన ప్రభావాన్ని చూపించనుంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వీరి ఓటే కీలకం కానుండడంతో నేతలంతా ఇప్పుడు సింగరేణి సమస్యల జపం పఠిస్తున్నారు. వారి కరుణాకటాక్షాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మేనిఫెస్టోలో సింగరేణి సమస్యలుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూపతిరవి, శ్రీరాంపూర్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నల్ల సూరీడే న్యాయ నిర్ణేత కానున్నాడు. ఈ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ ఓటరు తీర్పు అన్ని పార్టీల అభ్యర్థులకు కీలకం కానుంది. సింగరేణి గనులు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 10 అసెంబ్లీ స్థానాలపై సింగరేణి ఓటర్లు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములపై సింగరేణి సమస్యలు ప్రభావం చూపుతాయి. కంపెనీ మొత్తంలో 11 డివిజన్లుండగా ఒక్కో డివిజన్ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌పై ప్రభావం చూపుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సెగ్మెంట్‌పై బెల్లంపల్లి డివిజన్, చెన్నూర్‌పై మందమర్రి, మంచిర్యాలపై శ్రీరాంపూర్ డివిజన్ కార్మికుల ప్రభావం ఉంటుంది. కరీంనగర్‌లోని రామగుండం, మంథని సెగ్మెంట్ల పరిధిలో ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, ఆడ్రియాల డివిజన్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో భూపాలపల్లి డివిజనే నియోజకర్గ కేంద్రం కావడం విశేషం. ఇక సింగరేణి పుట్టిన ఖమ్మం జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలపై ఆ డివిజన్ ఓటర్ల ప్రభావం ఉంటుంది. మణుగూరు డివిజన్ పినబాక నియోజకవర్గంలో పరిధిలో ఉంటుంది. ఈ పది నియోజకవర్గాలే కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ స్థానంపై అధికంగా, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై స్వల్పంగా సింగరేణి ప్రభావం ఉంటుంది. సింగరేణిలో లక్షల ఓట్లు సింగరేణిలో 65వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబాల ఓట్లు కూడా కలుపుకుంటే సుమారు రెండులక్షలపైమాటే. వీరితో పాటు 20వేల మం ది కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు, 30వేల మంది రిటైర్డ్ కార్మికుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. సింగరేణిని నమ్ముకుని చిరు వ్యాపారాలు, కులవత్తులు చేసుకొనే ఓటర్లు మరో రెండు లక్షల మంది ఉంటారు. మేనిఫెస్టోలో ‘సింగరేణి’ నాలుగు జిల్లాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే సింగరేణి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో సింగరేణి సమస్యలను చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా వాటిని ప్రస్తావించి ఓట్లు రాబట్టుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలకు సింగరేణిలో అనుబంధ కార్మిక సంఘాలుంన్నాయి. కాబట్టి వాటి ఉనికి కోసం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడం కోసమైనా మేనిఫెస్టోలో సింగరేణి సమస్యలు చేర్చాలంటూ తమ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్‌కు ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కు టీబీజీకేఎస్, సీపీఐకి ఏఐటీయూసీ, బీజేపీకి బీఎంఎస్, సీపీఎంకు సీఐటీయూ, టీడీపీకి టీఎన్టీయూసీ, వైఎస్సార్ సీపీకి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అనుబంధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ తయారు చేస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను టీబీజీకేఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్‌కు వినతిపత్రం రూపంలో అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను ఐఎన్టీయూసీ నేతలు సిద్ధం చేశారు. ఇలా అన్ని యూనియన్లు పార్టీల మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వామ్యం అవుతున్నాయి. హామీ కోరుతున్న కార్మికులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ ప్రధాన డిమాండ్లు తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. ఆగిపోయిన వారసత్వ ఉద్యోగాలు తిరిగి మొదలు పెట్టాలని,కొత్త భూగర్భ గనులు తవ్వాలని, కార్మికులను ఐటీ పరిధి నుంచి మినహాయించాలని, పెన్షన్‌ను 40 శాతానికి పెంచాలని, గని ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కార్మికులకు విద్య, వైద్యం, సంక్షేమం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చే పార్టీలకే పట్టం కడతామని కోల్‌బెల్ట్ ఓటర్లు ముక్త కంఠంతో చెబుతున్నారు. సింగరేణికి వైఎస్ అండ.. పందిళ్ల శ్యాంసుందర్, గోదావరిఖని * 17 వేల ఇళ్ల క్రమబద్దీకరణ గోదావరిఖనిలో 1961లో తొలిసారిగా బొగ్గుగనిని ప్రారంభించగా...అప్పటి కార్మికులు, బతుకుదెరువు కోసం వచ్చిన ప్రజలు సింగరేణి స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకున్నారు. పాత ఇళ్లకు మరమ్మతులు చేసుకోవాలంటే సింగరేణి యాజమాన్యం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. వైఎస్సార్ హయాంలో స్థానిక నేతలు ఆయనను కలిసి ఈ ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. స్పందించిన వైఎస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను 10 రోజుల్లో సర్వే చేయించారు. ఇంటి స్థలాలను క్రమబద్ధీకరిస్తూ 2009 ఫిబ్రవరి 23న 17 వేల మందికి వైఎస్ స్వయంగా పట్టాలను అందజేశారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ సంఖ్యలో ఇళ్లను క్రమబద్ధీకరించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. * మరణించిన కార్మికులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు 2003 జూన్ 16న జీడీకే 7 ఎల్ఈపీ గనిలో 17 మంది, అదే ఏడాది ఆగస్టు 16న జీడీకే 8ఏ గనిలో 10 మంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణించగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. 2006 నవంబర్ 11న కొత్తగూడెం వీకె-7 గనిలో నలుగురు కార్మికులు మరణించగా అప్పడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ఒక్కో కుటుంబానికి రూ.ఏడు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కార్మిక కుటుంబాలను ఆదుకున్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లించింది. కార్మికులపై ఉక్కు పాదం - కోల్ఇండియాలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విధానాన్ని 1998లో ప్రవేశపెట్టి కార్మికులు తమకు ప్రాతినిధ్యం వహించే సం ఘం ఆధ్వర్యంలో పోరాడే అవకాశం లేకుండా చేశారు. - గుర్తింపు సంఘం యాజమాన్యంతో రాజీ పడితే కార్మికుల హక్కులకు విఘాతం కలిగే పరిస్థితి వస్తుందని విమర్శలు వచ్చినా బేఖాతరు చేశారు. ఇతర సంఘాలు సమ్మె చేపడితే ఉక్కుపాదం మోపారు. ఎస్మా ప్రయోగించడంతో పాటు వేతనాల నుంచి కోత విధించేలా చట్టాలను అమలు చేయించారు. - {పతీ ఏటా 10 శాతం మంది కార్మికులను తగ్గించాలని 2000లో నిర్ణయించి, ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. యంత్రీకరణను వేగవంతం చేయడం, భూగర్భ గనులకు బదులు ఓపెన్‌కాస్ట్‌లను ప్రవేశపెట్టడం, కార్మికులు, ఉద్యోగులతో బదులు కాంట్రాక్టు సంస్థలతో మట్టి తొలగించడం లాంటి పనులను అప్పగించడం ద్వారా ఉద్యోగాల్లో కోత పెట్టారు. - గనులలో పనిచేసే కార్మికులకు ఆరోగ్యం దెబ్బతిని విధులకు గైర్హాజరైతే, సుమారు పదివేల మందికి నోటీసులు జారీ చేసి ఉద్యోగాల నుంచి తొలగించారు. డిస్మిస్డ్ కార్మికులు తమకు తిరిగి ఉద్యోగాలివ్వాలంటూ ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారు. - పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ) నిబంధనలను కఠినతరం చేశారు. చిన్న జబ్బు ఉన్న వారు కూడా ఉద్యోగం కోల్పోయారు. - సింగరేణిలో నియామకాలను పూర్తిగా నిలిపివేశారు. అది నాలుగు జిలాల్లో నిరుద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. వారసత్వ ఉద్యోగాలమీద యువకులు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. హామీలు సరే.. అమలు సాధ్యమేనా? గెస్ట్ కాలమ్/శివ: మొత్తం మీద చూస్తే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం మీద కొత్త విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేసే బాధ్యత ఉంది. కనుక దీనిని ఆచరణలో చూపే క్రమంలో సింగరేణిలో కొత్త గనులు, కొత్త టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలతో కొత్త శోభ సంతరించుకునే అవకాశం ఉంది. రానున్న కాలంలో ఇదే తెలంగాణ కొంగుబంగారం కానుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా రూపాంతరం చెందింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న క్రమంలో సింగరేణి కార్మికులు దాదాపు 40రోజులు సంపూర్ణంగా సమ్మెచేశారు. ఇన్ని రోజులపాటు తమ సమస్యల కోసం సమ్మె చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. 80వ దశకంలో సుదీర్ఘ సమ్మె చేపట్టినా అది సింగరేణి అంతటా జరగలేదు. కార్మికేతర సమస్యలపై జరిగిన తొలి సమ్మెగా సకల జనుల సమ్మెను పేర్కొనవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు ఇచ్చిన హామీలు, తెలంగాణ ఏర్పాటుతో సంస్థకు, కార్మికులకు కలిగే ప్రయోజనాలపై నేడు సర్వత్రా చర్చ జరుగుతోంది. వరాల జల్లులు ఎన్నికల సమయంలో తెలంగాణ అనుకూల పార్టీలు గతంలో ఎన్నో వరాలు ప్రకటించాయి. వాటిలో.. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నిలుపుదల, డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, కొత్త బావుల నిర్మాణం, గోదావరి తీరం వెంబడి కొత్త విద్యుత్ కార్మాగారాల ఏర్పాటు, సింగరేణి ప్రాంతంలో మరో మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు, మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం, క్రమంగా వారిని పర్మినెంటు చేయడం, రాష్ట్రేతర బడా కాంట్రాక్టర్లకు ఓబీ పనుల్లో అవకాశం నిరాకరించడం వంటివి ఉన్నాయి. వేతనాల పెంపుదల, మృతిచెందిన కార్మికులకు రూ.30లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అవినీతి కుంభకోణాలపై విచారణ వంటివి అందులో కొన్ని. కొన్ని సాధ్యం..మరికొన్ని అసాధ్యం గోదావరి తీర ప్రాంతంలో కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, కొత్త బావుల నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం కొత్త ప్రభుత్వాలకు అంత కష్టమేమీకాకపోవచ్చు. అయితే నాయకులు ఇస్తున్న హామీల్లో కొన్నింటిని నెరవేర్చడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓపెన్‌కాస్టు గనుల వల్ల తెలంగాణ బొందలగడ్డగా మారిందనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వాటిని మూసేస్తామని, కొత్తవాటికి అనుమతులు రాకుండా చూస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఎందుకంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో 70శాతం ఓసీ గనుల నుంచే వస్తుంది. లాభాలు వస్తున్నది కూడా ఓసీ గనుల వల్లనే. వాటిని మూసేస్తే సుమారు 20వేలమంది కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి. లేదంటే బయటకు పంపాలి. ఈ రెండింటిలో ఏది చేసినా కార్మికులు ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి అది అసాధ్యం. ఇక డిపెండెంట్లకు ఉద్యోగాలు కూడా ఆచరణ సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. కార్మికుల పిల్లలు ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్నారు. వారిలో ఎక్కువ మంది ఐటీరంగంపై ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి వారి నుంచి ఈ హామీకి అంత ప్రోత్సాహం ఉండకపోవచ్చని సింగరేణి అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
గ్రేటర్ సిద్ధం
ఎన్నికలకు భారీ ఏర్పాట్లు అధికారుల కసరత్తు 1400 మందికి ఓ పోలింగ్ బూత్ వీడియో బృందాల ఏర్పాటు ప్రభుత్వోద్యోగులే బీఎల్వోలు తొలిసారిగా నోటా అమలు త్వరలో ఫొటో ఓటరు స్లిప్‌ల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ‘గ్రేటర్’లో ఏప్రిల్ 30న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా, బోగస్‌ల ఏరివేత, అవసరమైన పోలింగ్స్టేషన్లు, ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణకు తగినంతమంది సిబ్బంది, వీటన్నింటితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు మునిగారు. మరోవైపు ఎన్నికల్లో అక్రమాలు నిరోధించేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని అరికట్టేందుకు సర్వ సరంజామాతో సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈసారి ప్రత్యేకంగా వీడియో బృందాలు.. పెయిడ్ న్యూస్ నిరోధానికి కమిటీలు తదితరమైనవి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు.. చేయనున్న ఏర్పాట్లు.. కల్పిస్తున్న సదుపాయాలు తదితరమైన వాటి గురించి అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి.. జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ రాహుల్ బొజ్జా వివరించారు. మంగళవారం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతానికి 3091 పోలింగ్‌కేంద్రాలు అవసరమని భావిస్తున్నామన్నారు. వాటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు విద్యుత్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య పెరగనున్నందున అందుకనుగుణంగా 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌బూత్ చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. బూత్‌లెవెల్ అధికారులుగా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమిస్తామన్నారు. అక్రమాలు నిరోధించేందుకు, డబ్బు ప్రభావాన్ని అరికట్టేందుకు వ్యయపరిశీలకుల తో పాటు వీడియో నిఘా బృందాలు తదితరమైనవి ఏర్పాటు చేశామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు జీహెచ్ఎంసీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై సుమోటోగానూ, ఫిర్యాదుల ఆధారంగానూ కేసులు నమోదు చేస్తామన్నారు. వీటికి సంబంధించిన నివేదికలు ఏరోజుకారోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు పంపిస్తామన్నారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలకు సంబంధించి కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వీటికి సంబంధించి తొలిదశలో వాటిని తొలగించడం.. తదుపరి పెనాల్టీలు, నోటీసులు, ఆపై వ్యక్తిగత, పార్టీ ఖాతాలో ఎన్నికల ఖర్చుగా చూపిస్తామన్నారు. పోలింగ్ తీరును గుర్తించేందుకు, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ‘వెబ్‌క్యాస్టింగ్’ను వినియోగిస్తామన్నారు. ఇందులో వినియోగించే వెబ్‌కెమెరాల ద్వారా కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు సైతం ఆయా పోలింగ్ కేంద్రాలను వీక్షించవచ్చన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి రాజకీయ పార్టీల వారికి ఇప్పటికే వివరించామన్నారు. ఎన్నికల ఖర్చును లెక్కించడానికి వీడియో నిఘా బృందాలు, వీడియోలు పరిశీలించే బృందాలు, ఫ్లయింగ్స్క్వాడ్లు, తదితర బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పలు అంశాల గురించి వివరించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్(ఎన్నికలు) శివపార్వతి పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసే బృందాలివీ.. వీడియో సర్వైలెన్స్ టీమ్: టీమ్‌కు ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్ వీడియో వ్యూయింగ్ టీమ్: టీమ్‌కు ఒక అధికారి, ఇద్దరు క్లర్కులు అకౌంటింగ్ టీమ్: టీమ్‌కు ఒక అధికారి, ఒక క్లర్కు ఫ్లయింగ్ స్క్వాడ్స్: ఒక్కో నియోజకవర్గానికి మూడు టీమ్‌లు. ఒక్కో టీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, వీడియోగ్రాఫర్, నలుగురు సాయుధ పోలీసులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్: ఒక్కో నియోజకవర్గానికి మూడు టీమ్‌లు. టీమ్‌కు ఒక మేజిస్ట్రేట్, నలుగురు పోలీసు అధికారులు ఎంసీసీసీ టీమ్స్ : టీమ్‌కు ఒక సివిల్ ఆఫీసర్, పోలీసు ఆఫీసర్, వీడియోగ్రాఫర్ సహాయ వ్యయ పరిశీలకుడు: అసెంబ్లీకే కాదు పార్లమెంటు నియోజకవర్గాలకూ ఉంటారు. మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ : ఇందులో జిల్లా ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్, ఖైరతాబాద్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన సెంట్రల్ జోన్ కమిషనర్, ఆలిండియా రేడియో ప్రతినిధి, మీడియా ప్రతినిధి, జీహెచ్ఎంసీ సీపీఆర్వో సభ్యులు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ సభ్యులు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన హెచ్ఎండీఏ సెక్రటరీ సభ్యులు. ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌సెంటర్ నెంబరు (040-21 11 11 11) ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనికి ఇన్ఛార్జిగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్, ఐటీ) డి.జయరాజ్ కెన్నెడి, కోఆర్డినేటింగ్ అధికారిగా రవాణా విభాగం సూపరింటెండెంట్ కె. మహేశ్ కులకర్ణి బాధ్యతలు నిర్వహిస్తారు. వీరితోపాటు షిఫ్టుల వారీగా ఇతర సిబ్బంది పనిచేస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 040-23302440, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు 155304 నెంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఫ్యాక్స్ నెంబరు 040- 23264068. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 15 పార్లమెంటు నియోజకవ ర్గాలు 2 ప్రస్తుత పోలింగ్‌కేంద్రాలు 3091 ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 2 పోలింగ్ ఏప్రిల్ 30 ఓట్ల లెక్కింపు మే 16 ఎన్నికల ముగింపు మే 28 వ్యయ పరిమితి అభ్యర్థి గరిష్ట పరిమితి లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షలు వివిధ బృందాల బాధ్యులు వీరే బృందం అధికారివ్యయ పరిశీలక బృందం నోడల్ అధికారి విజయకుమారి, జీహెచ్ఎంసీ సీఎఫ్ఓవీడియో సర్వైలెన్స్ టీమ్స్ జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాసరావు, సీసీపీ వీడియో వ్యూయింగ్ టీమ్ జిల్లాస్థాయి ఇన్‌ఛార్జి ఫణిశ్యామ్, విద్యుత్ విభాగం డీఏఓ అకౌంటింగ్ టీమ్స్ జిల్లాస్థాయి ఇన్‌ఛార్జి నీరజ, జీహెచ్ఎంసీ డీఏఓ ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ జిల్లా ఇన్‌ఛార్జి ఎం. భాస్కర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ఏఎస్పీ ఫొటో ఓటరు స్లిప్‌లు ఈసారి ఓటర్లకు ఓటరు జాబితాలో వారి పేరు, పోలింగ్ కేంద్రం, క్రమసంఖ్య వివరాలు తెలియజేసే ఓటరు స్లిప్‌లను బూత్‌లెవెల్ అధికారులే ప్రజల ఇళ్లకు వెళ్లి అందజేస్తారు. ఇవి ఫొటోలతో కూడి ఉంటాయి. వీటినే ఓటరు గుర్తింపు పత్రాలుగా కూడా గుర్తిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వీటిని పంపిణీ చేస్తారు. నోటా ఎనికల బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు పైవారిలో ఎవరికీ కాదు (నోటా) ఆప్షన్ కూడా ఈవీఎంలలో ఉంది. ప్రజలకు దీనిపై కూడా అవగాహన కల్పిస్తారు. అవసరాలకనుగుణంగా దాదాపు 16000 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఇంకా గడువుంది ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఇంకా గడువుంది. ఈనెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటేనే ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఓటరు కార్డులు అందజేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు లక్షా65వేల మందికి ఇంకా ఓటరు కార్డులు అందాల్సి ఉంది. -
దక్షిణ ముంబైలో చతుర్ముఖ పోరు
సాక్షి, ముంబై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్‌సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ,స్వాభిమాన్ల మహాకూటమి, ఎమ్మెన్నెస్‌తోపాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పొత్తు పంపకంలో భాగంగా ఈసారి కూడా దక్షిణ ముంబై స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థిగా మిళింద్ దేవ్రాకే మళ్లీ అవకాశమిచ్చింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఎమ్మెన్నెస్ వల్ల మిలింద్ దేవ్రాకే గెలుపు అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలా నందగావ్కర్ ఈసారి గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 1,59,729 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన బాలా నందగావ్కర్ స్థానిక ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ప్రచార శైలిలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన గెలుపు సంగతి దేవుడెరుగు? ఈసారి కూడా తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని శివసేన అభ్యర్థి మోహ న్ రావులేలో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో 1,46,118 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన మోహన్రావులే ఈసారి గెలవడమే ధ్యేయంగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ లోక్‌సభ స్థానాన్ని ఎమ్మెల్సీ మంగల్‌ప్రభాత్ లోధా కుమారుడు అభినందన్ లోధాకు కేటాయించాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని శివసేన నిరాకరించింది. దీంతో ఈ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇది శివసేన అభ్యర్థికి కొంత మైనస్ కాగా, పరోక్షంగా బాలా నందగావ్కర్కు వారు సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ మొదలైంది. దీనికితోడు బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించి ఈ ఊహగానాలకు బలంచేకూరేలా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేశారు. ఈ నేపథ్యంలో శివసేనకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెన్నెస్‌తో కాంగ్రెస్‌కు లాభం...? దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో గతంలోమాదిరిగానే ఈసారి కూడా ఎ మ్మెన్నెస్ అభ్యర్థి కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి లబ్దిపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానాందగావ్కర్ కారణంగానే శివసేన ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రా సునాయాసంగా విజయం సాధించారు. ఈసారి కూడా అదే సీన్ పునరావృతం అయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా బాలా నాందగావ్కర్కు కూడా నియోజకవర్గంలో మరింత పట్టు సంపాదించారు. ఈ నేపథ్యంలో గట్టిపోటీ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి ఆప్ నుంచి మీరా సన్యాల్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరా ఓటర్లను ఎంత వరకు ఆకట్టుకోనుందనేది వేచిచూడాల్సిందే. -
పోలీసులకు సవాల్
వరుస ఎన్నికలతో సతమతం సెలవులు రద్దు చేసిన పోలీసు శాఖ పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు ముమ్మరం జిల్లాకు చేరుకోని అదనపు బలగాలు ఇప్పటివరకు 40 మంది బైండోవర్ ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉంది. వరుస ఎన్నికలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేయనున్నాయి. మార్చి 30న మున్సిపల్, నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఇందుకోసం పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. పట్టణాల్లో కవాతు కూడా నిర్వహిస్తున్నాయి. పోలీసులు రహదారులపై వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. సెలవులు రద్దుమున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలున్న వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు 24 గంటలు విధుల్లో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనారోగ్యంతో ఉన్నా విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. బంధువుల శుభకార్యాలకు వెళ్లకూడదని, ఇతర ఎలాంటి పనులు పెట్టుకోవద్దనిన ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోని వాతావరణం తెలుసుకోవాలని, ఇందుకు ప్రత్యేక పరిశీలన చేయాలని ఆదేశాలు వచ్చాయి. పటిష్ట బందోబస్తు కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పొలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలు ప్రస్తుత సిబ్బందితోపాటు అదనంగా బలగాలు రానున్నాయి. పోలింగ్ బూత్‌లవారీగా సిబ్బంది ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ ప్లాటూన్లు, బాంబ్, డాగ్‌స్క్వాడ్ ప్రాంతాలవారీగా విభజించి తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లవారీగా భద్రతను ఏర్పాటు చేసి ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అదనంగా రెండు వేల బలగాలు.. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసులు సరిపోదు. ఇప్పటికే పనిఒత్తిడిలో ఉన్న పోలీసులతోనే ఎన్నికల విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో మరో రెండు వేల మంది అదనపు బలగాలు అవరమున్నట్లు జిల్లా పోలీసు శాఖ గుర్తించింది. ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖకు ప్రతిపాదనలు పంపించారు. నేడో, రేపో పోలీసు బలగాలు జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులతోపాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ వంటి ప్లాటూన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లయింగ్‌స్వ్కాడ్ బృందాలు గస్తీగా తిరగనున్నారు. ఈ ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నాయకుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బట్టి గన్‌మెన్ ఎంపిక ఉంటుంది. ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు రోజుల్లో 40 మందిని బైండోవర్ చేశారు. వీరితోపాటు సంఘ విద్రోహ శక్తులను గుర్తిస్తున్నారు. త్వరలో వీరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. మద్యం విక్రయాలపై నిఘా జిల్లాలోని ఐఎంఎల్ డీపో నుంచి తెచ్చిన మద్యాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. పరిమిత సమయంలో వ్యాపారం చేయాలి. జిల్లాకు సంబంధం లేని మద్యం విక్రయాలు జరిపినా, రవాణా చేసిన చర్యలు తీసుకోనున్నారు. నాటుసారా విక్రయాలు, బెల్లంపట్టిక సరఫరా ప్రాంతాలపై నిఘా ఉంచనున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో దీని కోసం మూడు బృందాలు నిత్యం పరిశీలన చేసేందుకు ఏర్పాటు చేయనున్నారు. -
ఎన్నికల వణుకు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురుచూసిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ పేరు చెబితేనే వణికిపోతున్నారు. సాధారణ ఎన్నికలకు సిద్ధమైన రాజకీయ పార్టీలు, నాయకులు మధ్యలో మున్సిపల్ ఎన్నికలు రావడాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన, అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించాలని శుక్రవారం కోర్టు ఆదేశించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా మారింది. మార్చి 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మే 7న సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. తలకు మించిన భారం రాజకీయ పార్టీలు, నేతలకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఒకేసారి మూడు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలకు సాధారణ ఎన్నికలు చావోరేవోగా మారాయి. వాటి కోసమే అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతోపాటు సకల హంగులతో సిద్ధమై వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పుడు పులిమీద పుట్రలా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముంచుకురావడం వారికి తలకు మించిన భారంగా మారింది. నేతలకు ఏ ఎన్నికల గురించి ఆలోచించాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. నేడో, రేపో జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది. కత్తిమీద సాము ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తలకు మించిన భారంగా మారనున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక ఎత్తయితే వ్యూహప్రతివ్యూహాలకు సైతం వారికి సమయం లేకుండాపోయింది. సాధారణంగా ఈ మూడు ఎన్నికలకూ ఒక్కో రకమైన వ్యూహం ఉంటుంది. సాధారణ ఎన్నికలను జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాలు, అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక రాజకీయాలు చాలా తక్కువ శాతంగానే ఈ ఎన్నికలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని ఎన్నికలు ఒకేసారి రావడంతో ఓటర్లు ఎలా స్పందిస్తారో కూడా అంతుపట్టడంలేదు. మరోవైపు సాధారణ ఎన్నికల్లో తన కోసం పనిచేయించుకోవాల్సిన నేతలను నేరుగా వేరే ఎన్నికల బరిలోకి దించాల్సి రావడం కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఆర్థిక అంశాలూ.. సవాలే ఒకేసారి మూడు ఎన్నికలలో తలపడే స్థాయి ఆర్థిక పరిపుష్టిని సాధించడం నేతలకు సామాన్య విషయం కాదు. ప్రస్తుతం సాధారణ ఎన్నికల ఖర్చుకే అభ్యర్థులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది మున్సిపల్, స్థానిక ఎన్నికలు తోడవడంతో వీటన్నింటికీ ఆర్థిక వనరులను సమీకరించుకోవడం రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు సవాలుగా మారింది. అధికారులకూ అగ్ని పరీక్ష మూడు ఎన్నికలను ఒకేసారి నిర్వహిం చాల్సి రావడం అధికార యంత్రాంగానికి అగ్ని పరీక్షగా మారింది. ఈ పరిస్థితి అధికారులకు చుక్కలు చూ పిస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర. ఇప్పుడు వారు ఎన్నికల పనితోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షలను స్వల్ప వ్యవధిలో నిర్వహించాల్సి ఉంది. ఇవి అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. మొత్తంగా ఒకేసారి వచ్చి పడిన ఎన్నికలు రాజకీయ పార్టీలు, నేతలతోపాటు అధికారులు, ఉద్యోగులనూ కలవరపెడుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ ఒకేసారి రావడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. -
లబ్‌డబ్బు..
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడమంటే ఇదేనేమో... మునిసిపల్ ఎన్నికలు జిల్లాలోని ముఖ్య నేతలకు కష్టకాలం తెచ్చిపెట్టాయి. సాధారణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో ముందుగా వచ్చిన ‘పురపాలక’ సమరం వారి ఖజానాకు ఎసరు పెడుతోంది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 30వ తేదీన మునిసిపల్, ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నారుు. అరుుతే... సాధారణ ఎన్నికల ముందు అకస్మాత్తుగా వచ్చిన మునిసి‘పోల్స్’ ముఖ్య నేతలకు సవాల్‌గా మారాయి. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీల ఎన్నికలు వారికి అనుకోని తిప్పలు తెచ్చిపెట్టారుు. ఈ పురపాలక సంఘాలు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కీలక నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారుు. ప్రధానంగా నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్ర మంత్రిగా చక్రం తిప్పిన పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్ విప్‌గా కీలకంగా వ్యవహరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవితకు ఈ ఎన్నికలు ఆందోళన కలిగిస్తున్నారుు. నర్సంపేట నగర పంచాయతీ ఎన్నిక రసవత్తరంగా మారగా... పోరుగడ్డ పరకాల టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ముందు నురుు్య.. వెనుక గొరుు్య ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న రాజకీయ పార్టీల నేతలు, ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా అంతా చక్కబెట్టుకున్నారు. ఈ క్రమంలో సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మునిపి‘పోల్స్’ వారి ప్రణాళికను దెబ్బతీశాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే నేతలకు మునిసిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి సహకారం అందించేది ఆయూ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులే. ముందుగా మునిసిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో.. వారి ఖర్చు ఎమ్మెల్యే బరిలో ఉన్న అభ్యర్థులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారుు. సాధారణ ఎలక్షన్స్‌పై మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రతి వార్డులో తమకు నమ్మకమైన, పార్టీని బలోపేతం చేయగల వారిని కౌన్సిలర్‌గా గెలిపించుకోక తప్పని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల బరిలో నిలిచిన వారి ఆర్థిక అవసరాలు తీర్చడం వారికి కష్టంగా మారింది. మునిసిపాలిటీల్లో 28 చొప్పున, నగర పంచాయతీల్లో 20 చొప్పున వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు సాధారణ ఖర్చుల కోసం కనీసం రూ.రెండు లక్షలు భరించినా... సగటున రూ.అర కోటికి చేరుకుంటుండడంతో ఎమ్మెల్యే బరిలో ఉన్న అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఒక వార్డుకు రెండు లక్షల రూపాయలు చిన్న మొత్తమేనని కౌన్సిలర్‌గా పోటీ చేసే వారు చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికల బరిలో దిగుతున్నామని... అన్ని రకాలుగా అండగా నిలవాల్సిందేనని నియోజకవర్గ నేతలకు తెగేసి చెబుతున్నారు. లేకుంటే వేరే దారి చూసుకుంటామని స్పష్టం చేస్తుండడంతో ఎన్నికల ఖర్చు సమస్య నుంచి బయటపడడం నియోజకవర్గ నేతలకు పెద్ద సమస్యగా మారింది. అలా అని పట్టించుకోకుండా ఉందామా అంటే... నెలలోపే జరిగే ఎన్నికల్లో తమకే ఇబ్బందులు వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని... ప్రభుత్వం ఆలస్యంగా ఎన్నికలు పెట్టడం వల్లే ఇలా అయిందని గగ్గోలుపెడుతున్నారు. జనగామ : పొన్నాల... గట్టెక్కేదెలా ఎమ్మెల్యేగా పొన్నాల ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామలో మునిసిపాలిటీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత నిలుపుకున్నా... తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు ఆయనను టెన్షన్‌కు గురిచేస్తున్నారుు. పొన్నాల లక్ష్మయ్య 2004 నుంచి మంత్రిగా పనిచేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో 2009 ఎన్నికల్లో అతి కష్టం మీద గట్టెక్కారు... కేవలం 236 ఓట్ల తేడాతో జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2009 మధ్యలో చేసిన అభివృద్ధితో పోల్చితే... ఈ ఐదేళ్లలో చేసింది తక్కువనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు సాధారణ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇలాంటి తరుణంలో 37 వేల మంది ఓటర్లు ఉన్న జనగామ మునిసిపాలిటీకి అసెంబ్లీ కంటే ముందుగా ఎన్నికలు రావడంతో దీని ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన పొన్నాలలో నెలకొంది. భూపాలపల్లి : గండ్రకు ‘తొలి’ గండం ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇటీవలి వరకు కీలకంగా వ్యవహరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి తాజా రాజకీయ పరిస్థితులు తలనొప్పిగా మారారుు. దీనికి తోడు కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీకి తొలి ఎన్నికలు కావడం... వాటి ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందనే అంచనా ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. నియోజకవర్గంలో 40 వేల మంది ఓటర్లు ఉన్న పట్టణం కావడంతో వారి తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కవితకు మహబూబా‘బాధ’ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవితకు మహబూబాబాద్ మునిసిపాలిటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారారుు. ఇటీవలే మునిసిపాలిటీగా మారిన మహబూబాబాద్ తెలంగాణ ఏర్పాటుతో జిల్లా కేంద్రంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. పట్టణంలో 40 వేల ఓటర్లు ఉండగా.... అధికార పార్టీ ఎమ్మెల్యేగా కవితపై ఉన్న వ్యతిరేకత, సానుకూలత ఈ ఎన్నికల్లో వెల్లడికానుంది. నర్సంపేట : త్రిముఖ పోటీ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సంపేటలో మునిసిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నారుు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీడీపీ దయనీయ పరిస్థితుల్లో ఉందనే అభిప్రాయం ఉంది. మరోవైపు తెలంగాణను సాధించిన పార్టీగా టీఆర్ఎస్కు జిల్లాలో ముఖ్య నాయకుడిగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. 24 వేల ఓటర్లు ఉన్న మునిసిపాలిటీ ఎన్నికల ఫలితం సుదర్శన్‌రెడ్డికి ఎలాంటి అనుభవాన్ని మిగల్చనుందో తేలాల్సి ఉంది. నర్సంపేట కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న దొంతి మాధవరెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సైతం నర్సంపేట నగర పంచాయతీ ఫలితం మాధవరెడ్డికి కీలకం కానుంది. 20 వేల ఓటర్లు ఉన్న పరకాల నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి ప్రతిష్టాత్మకంగా మారారుు. -
వర్మపై గరంగరం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పిఠాపురం ‘దేశం’లో నాయకత్వంపై కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. అక్కడి పార్టీ నాయకత్వంపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో అనుచరగణంతో తిరుగుతున్న నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వర్మకు అడుగడుగునా చుక్కెదురవుతోంది. ఆయన వ్యవహారశైలే ఇందుకు కారణమవుతోందని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. గత ఆరేడు నెలలుగా వర్మ, అతనితో విభేదిస్తోన్న నేతల మధ్య కొనసాగుతోన్న వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. పిఠాపురం రూరల్ మండలంలోని భోగాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఇంటింటా టీడీపీ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వర్మ స్థానిక మర్రిచెట్టు సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పార్టీకి మొదటి నుంచి కష్టపడి పని చేస్తున్న అల్లుమల్లు విజయకుమార్‌పై విమర్శలు చేశారు. విసుగెత్తిపోయిన నాయకులు, కేడర్ చివరకు ఆయనపై కుర్చీలు విసిరేసే పరిస్థితి వచ్చింది. పార్టీ కోసం మాట్లాడకుండా కేవలం విజయకుమార్ లక్ష్యంగా విమర్శలు చేయడం కేడర్ ఆగ్రహానికి కారణమైంది. ‘వర్మ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా చివరకు కారు కూడా ఎక్కకుండా అడ్డుకోవడంతో గత్యంతరం లేక ఆయన తిరుగుముఖం పట్టారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వర్మ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని కేడర్ ఆవేదన చెందుతోంది. వర్మ ఇటీవల టీడీపీలో ఉన్నవారిని పొమ్మనకుండా పొగబెడుతున్న తీరుతో దాదాపు అన్ని సామాజికవర్గాల్లోని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ పిఠాపురం రూరల్ మండల అధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్ ఉండగానే ఇటీవల ఎరుబండి రాజారావును వర్మ ఏకపక్షంగా రూరల్ అధ్యక్షుడిగా నియమించేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావు స్వగ్రామం జల్లూరులో ఆయన కుమారుడు జగదీష్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించడంతో స్థానిక పార్టీ నాయకులు వర్మపై మండిపడ్డారు. చిత్రాడలో వెలమ సామాజికవర్గానికి చెందిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ సింగంపల్లి బాబూరావుకు తెలియకుండా మొత్తం గ్రామ కమిటీలో మార్పులు చేర్పులు చేశారు. దీంతో వర్మ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలన్నింటికీ పేడ పూసి, దిష్టిబొమ్మలను దహనం చేసి, సామాజిక వర్గాలకు అతీతంగా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ జడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు కూడా వర్మ తీరుపై విసుగెత్తిపోయి పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరికి మద్దతుగా బీసీల్లో శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంగళి సుబ్బారావు కూడా వర్మ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న నాయకత్వంలో ఆత్మాభిమానం చంపుకుని ముందుకు సాగలేమని ద్వితీయ శ్రేణి మండిపడుతోంది. వర్మ వ్యవహార శైలిపై తమ అసంతృప్తిని ఇటీవల కాలంలో పలు దఫాలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పార్టీ జిల్లా ముఖ్యుల ముందు పెట్టినా ఫలితం లేకపోవడంతో నాయకులు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వర్మకే టిక్కెట్టు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించుకుంటే అందుకు తగ్గట్టుగానే స్పందించాలని పార్టీ కీలక నేతలు సమాలోచనలు చేస్తున్నారు. టిక్కెట్టు అంటూ వర్మకు కేటాయిస్తే పార్టీలోనే ఉండి వ్యతిరేకంగా పని చేయడమా లేక, ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడమా అనేదానిపై వర్మ వ్యవహార శైలి నచ్చని నేతలంతా వచ్చే 15 రోజుల్లో ఒక స్పష్టత తీసుకువచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వర్మ రెండో స్థానంలో నిలవడమే ప్రామాణికమనుకుంటే, దాని వెనుక ఎంతమంది కష్టపడి పని చేశారనేది లెక్క తీసుకోరా? అని కేడర్ ప్రశ్నిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే తాడోపేడో తేల్చుకోవడం మినహా గత్యంతరం లేదని నేతలు కుండబద్దలు కొడుతున్నారు. -
‘కోడ్’పైనే గురి
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జిల్లా నలుమూలలా చెక్‌పోస్టుల ఏర్పాటుకు కసరత్తు పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం జిల్లా యావత్తూ అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి సాధారణ ఎన్నికల కంటే ముందుగానే మునిసిపల్ ఎన్నికల కోడ్ కూసింది. షెడ్యూల్ ప్రకటించిన సోమవారం నుంచే తక్షణం అమల్లోకి రావడంతో కోడ్ ఉల్లం‘ఘనుల’పై జిల్లా యంత్రాంగం గురి పెట్టింది. ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలే కాకుండా జిల్లా మొత్తం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల కదలికలపై అధికారులు దృష్టి సారించారు. సాక్షి, గుంటూరు నిసిపల్ ఎన్నికల నేపథ్యంలో సామాజికంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, ప్రభుత్వ స్థలాల్లో గోడలపై రాతలతో పెద్ద ఎత్తున ప్రచారానికి నేత ములు దిగుతున్నారు. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచే జిల్లాకు చెందిన మంత్రులు మాజీలై సాధారణ పౌరులు కావడం, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వీల్లేదని, ఈ కార్యక్రమాలకు అధికారులు హాజరు కారాదని శనివారం రాత్రే జిల్లా కలెక్టరు సురేశ్‌కుమార్ ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా రెవెన్యూ అధికారులపైనే ఉందని కలెక్టరు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పరిషత్తు నుంచే సెట్ కాన్ఫరెన్స్‌లో మండల తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొత్తవి మంజూరు చేయరాదని, మంజూరైన పథకాల్ని తక్షణం గ్రౌండింగ్ చేయాలని కలెక్టరు సూచించారు. పట్టణాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసే హోర్డింగులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని, ముందుగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత స్పందించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నియమావళి అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అధికారులపై ఫిర్యాదులు అందినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కలెక్టరు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గానే మునిసిపల్ ఎన్నికల్ని ఇటు రాజకీయ పార్టీలతో పాటు అటు అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్ని విజయవంతంగా పూర్తి చేసి సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని యోచిస్తోంది. చెక్‌పోస్టులతో పటిష్ట బందోబస్తు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం సహకారం తప్పనిసరి. జిల్లా నలుమూలల చెక్‌పోస్టుల ఏర్పాటు, నేరచరితులు, అనుమానితులు, బైండోవర్ కేసులు తదితర విషయాల్లో రెవెన్యూ, పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది. {పతి పోలింగ్ స్టేషన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. చెక్‌పోస్టుల తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టుబడినా, కోడ్ ఉల్లంఘిస్తే వెంటనే కేసులు నమోదు చేసేందుకు రెవెన్యూ, పోలీస్ సంయుక్తంగా విధులు నిర్వహించాలి. కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రతి చర్య వీడియో తీయించాలని, ఈ వీడియో చూసేందుకు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దరిమిలా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హైదరాబాదు నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టరు, జేసీలు వివరించారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 12 పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితా ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు సరిపడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) అందుబాటులో ఉన్నాయి. మునిసిపాలిటీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లు యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేసి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిరోధించేందుకు రిటర్నింగ్ అధికారులకు అధికారం ఇచ్చారు. -
మేము రెడీ
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే సర్వ సన్నద్ధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే రెండుసార్లు సమీక్ష జరిపిన భన్వర్‌లాల్ అన్ని పరిస్థితులపై దృష్టి సారించిన జిల్లా అధికారులు గత ఎన్నికల పరిణామాలపైనా ఆరా ఈవీఎంల భద్రత కోసం రూ.98.93 లక్షలు నేడో రేపో రానున్న అదనపు పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాలలో మోహరింపు ఓట్ల పండుగ కోసం అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అంశాలనూ పరిశీలిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ గురించే కాకుండా శాంతిభద్రతలపైనా దృష్టి సారిస్తున్నారు. గత అనుభవాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులనూ, సిబ్బందిని నియమించిన ఉన్నతాధికారులు వారికి ఎప్పటికప్పుడు తగు సూచనలూ, సలహాలు అందజేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారయంత్రాంగం సన్నద్ధమైంది. సుమారు18 లక్షల పైచిలుకు ఓటర్ల కోసం 2,005 పోలింగ్ కేంద్రా లు, 4,010 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీ ఎంలు) సిద్ధం చేశారు. ఈ నెల 14 వరకు జిల్లాలో మూడేళ్లకు పైబడిన అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ముగించిన ఉన్నతాధికారు లు, బదిలీపై వచ్చిన వారికి ఎన్నికల విధులు కేటాయించారు. ఈ వారంలో రెండుసార్లు వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల ను సమీక్షించారు. కాగా, ఎన్నికల నిర్వహణకు రెండు రోజులలో అదనపు పోలీసు బలగాలు జిల్లాకు రానున్నాయి. ఈవీఎంల భద్రత కోసం నిర్మించిన గోదాములకు రూ.98.93 లక్షలు విడుదల చేస్తూ జీఓఆర్టీ నం.773 ద్వారా భన్వర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 18,04,664 మంది ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందు లో అత్యధికంగా 9,31,911 మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పా టు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే సున్నిత, అతి సున్నిత గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు వీడియో రికార్డింగ్, వెబ్ కాస్టిం గ్, లైవ్ కాస్టింగ్‌ల ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షిం చేందుకు ఐఐఐటీ విద్యార్థులను వినియోగించుకునే అవకాశాలను కూడా సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో అక్రమ మద్యం, డబ్బు రావడానికి వీలు లేకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు పాయింట్లను గుర్తించారు. ప్రతి నియోజకవర్గానికి రిట ర్నింగ్ అధికారితో పాటు ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు. జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన సంకేతాలున్నాయని తెలుస్తోంది. 2009 ఎన్నికల నివేదికల పరిశీలన సాధారణంగా ఎన్నికలలో చెదురు మదురు సంఘటన లు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2009 సార్వత్రిక ఎన్నికల పరిణామాలపైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలన జరిపినట్లు తెలిసింది. ఆ ఎన్నికల లో చోటు చేసుకున్న ఘర్షణలు, నమోదైన కేసులపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులలో అదనపు పోలీసు బలగాలు రానున్నాయి. వీటిని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలలో మోహరిం చే విషయమై కసరత్తు చేసినట్లు సమాచారం. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మకంగా మారిన గ్రామాలపైనా సమీక్ష జరిపి పోలింగ్ సందర్భంగా నిఘా పెంచే ప్రయత్నంలో ఉన్నారు. 2009 ఎన్నికల సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలపై ఇండియన్ పీనల్ కోడ్ కింద 57 కేసులు నమోదయ్యాయి. ఈసారి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో లెసైన్సుడు ఆయుధాలు కలిగిన పలువురి జాబితాను సిద్ధం చేసిన అధికారులు,నోటిఫికేషన్ విడు దల కాగానే వారి ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. జిల్లా పరిస్థితి ఇది అసెంబ్లీ నియోజకవర్గాల 9 మొత్తం ఓటర్లు 18,04,664 మహిళలు 9,31,911 పురుషులు 8,72,753 పోలింగ్ కేంద్రాలు 2,005 సిద్ధం చేసిన ఈవీఎంలు 4,010 -
ఓటుపై అవగాహన కల్పించాలి
1400 ఓటర్లను మించితే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్ అహ్మద్ బాబు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికారులు వివిధ పద్ధతుల ద్వారా ఓటు హక్కు వినియోగం, విలువలపై అవగాహన కల్పిం చాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటు విలువ ప్రతి ఒక్కరికి తెలిసేలా యువజన సంఘాలు, విద్యార్థి, స్వయం సహాయక, శ్రమశక్తి సం ఘాలు, నెహ్రూ యువకేంద్రం, తదితర సం స్థలతో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు నిబంధనలు తెలుసుకొని విధులు నిర్వర్తించాలని అన్నారు. నూతనంగా జిల్లాలో రెండు లక్షల 20 వేల ఓటర్లు నమోదైనందున వారికి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలన్నా రు. 1400 మంది ఓటర్లకుపైగా ఉన్న పోలిం గ్ కేంద్రాల్లో అదనంగా మరో పోలింగ్ కేం ద్రం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొం టున్నందున 33 కాలమ్స్‌తో తయారు చేసిన ఫ్రొఫార్మా ప్రకారం సిబ్బంది వివరాలు వారం రోజుల్లోగా అందించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ సిబ్బంది కూడా కచ్చితంగా ఓటు వినియోగించుకోవాలన్నారు. అనంతరం వివిధ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. జేసీ లక్ష్మీకాంతం, అదనపు జేసీ రాజు, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఓటర్లు 81,45,91,184
తొలి లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఐదు రెట్ల పెరుగుదల న్యూఢిల్లీ: దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 81.45 కోట్లకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. తొలి సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఓటర్లు దాదాపు ఐదు రెట్లు పెరిగారని తెలిపింది. త్వరలో 16వ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17,32,12,343 ఉంటే.. వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 81,45,91,184 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2009 సాధారణ ఎన్నికల నాటితో పోలిస్తే ఓటర్లు 9,75,06,083 మంది పెరిగారు. 1998తో పోలిస్తే 34 శాతం పెరిగింది. దేశంలో అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్(80)లో భారీగా ఓటర్ల పెరుగుదల నమోదైంది. 1998లో యూపీలో 10.19 కోట్ల మంది ఓటర్ల ఉండగా.. ప్రస్తుతం 13.43 కోట్లకి చేరింది. దేశం మొత్తం ఓటర్లలో యూపీ వాటా 16.5 శాతం కావడం విశేషం. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 49.1 శాతం మంది ఓటర్లు ఉన్నారు. సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, నాగాలాండ్ కలిస్తే 0.5 శాతం మంది ఓటర్లు కూడా లేకపోవడం గమనార్హం. 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను పరిశీలిస్తే... దాద్రా నగర్ హవేలీలో అత్యధిక ఓటర్ల పెరుగుదల రేటు నమోదైంది. 2004 నుంచి 2014 మధ్య ఇక్కడ 53.9 శాతం కొత్త ఓటర్లు నమోదయ్యారు. పుదుచ్చేరి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 39.1 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమబెంగాల్ అత్యధికంగా 31.7 శాతం పెరుగుదల రేటును నమోదు చేసుకుంది. మొత్తం ఓటర్లలో 98.27 శాతం రాష్ట్రాల్లో ఉంటే.. 1.73 శాతం కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం ఓటర్ల సంఖ్య 1951-52 17,32,12,343 1998 60.58,80,192 2009 71.69,85,101 2013-14 81.45,91,184 -
ఎన్నికల వేళ... ‘స్వయం సహాయం’
పనుల మాటున కాంగ్రెస్ నేతల నిధులు పందేరం జెడ్పీ పనులతో ప్రలోభాలు ఎస్‌హెచ్‌జీల ముసుగులో కాంగ్రెస్ నాయకులకు కట్టబెడుతున్న వైనం ఇప్పటికే రూ. కోటీ 70 లక్షల పనులు ధారాదత్తం ఎన్నికల వేళ ప్రజావసరాల ముసుగులో కాంగ్రెస్ నాయకులు ‘స్వయం సహాయం’ చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఎన్నికల కోడ్ రాకముందే పనుల మాటున తలకో కొంత ముట్టజెబుతున్నారు. కార్యకర్తలకు, చోటామోటా నేతలకు స్వయం సహాయక సంఘాల ముసుగులో అభివృద్ధి పనులను ్చఅప్పగిస్తున్నారు. తద్వారా కార్యకర్తలకు కొంత ఇవ్వడంతో పాటు పర్సంటేజీల రూపంలో తాము కొంత వెనకేసుకుంటూ...నీకు సగం, నాకు సగం అన్న రీతిలో వ్యవహారాలు సాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనుల పందేరాని కి దిగారు. అభివృద్ధి పనులు అప్పగించి గ్రామీణ ప్రాంత నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డా రు. ఇన్నాళ్లూ ఖర్చు చేయని నిధుల్ని యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేస్తున్నారు. తాము సూ చించిన పనులకు నిధులు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ అధికారులకు సిఫారసు చే స్తున్నారు. వాటిని ఎవరికి మంజూరు చేయాలో పరోక్షంగా సూచిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.కోటీ 70లక్షల విలువైన పనుల్ని స్వయం సహాయక సంఘాల ముసుగులో కాంగ్రెస్ నాయకులకు కట్టబెట్టారు. కోట్లాది రూపాయల విలువైన మరికొన్ని పనులు ధారాదాత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 13వ ఆర్థిక సంఘం, స్త్రీ, శిశు సంక్షేమం, స్టేట్ ఫైనా న్స్ కమిషన్, బీఆర్జీ తదితర నిధులను నిబంధనల మేరకు ఖర్చుపెట్టాలి. అవసరమైన చోట పనులు మంజూరు చేసి, పంచాయతీరాజ్ ఇం జనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో స్వయం సహాయక సంఘాల ద్వారా పనులు చేపట్టాలి. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా చేస్తున్నారు. రాష్ట్ర విభజన, ప్రజా కంఠక పాలనతో వెల్లువెత్తిన వ్యతిరేకతను నిధుల పందేరంతో నియంత్రించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రజాప్రతి నిధులు వచ్చారు. ఈమేరకు పనుల ప్రలోభ పె డుతున్నారు. ముందుగా జిల్లా పరిషత్‌లో ఉన్న నిధులేంటో తెలుసుకుంటున్నారు. ఎవరికివ్వా లో జాబితాకూడా తయారు చేసుకుంటున్నారు. ఆ మేరకు ప్రాంతాల వారీగా పనులు ప్రతిపాదిస్తున్నారు. జిల్లా పరిషత్ అధికారుల కు తమ లెటర్ ప్యాడ్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు సి ఫారసు చేస్తున్నారు. చెప్పినట్టుగా పనులు మం జూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తమ అనుచరుల్ని నేరుగా జెడ్పీకి పంపిస్తున్నారు. దీంతో జెడ్పీ అధికారులు కాదనలేకపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద *80 లక్షలు విలువైన 50పనుల్ని మంజూరు చేసినట్టు తెలిసింది. అలాగే సాధార ణ, ఆర్థిక సంఘం, స్త్రీ, శిశు సంక్షేమం నిధుల నుంచి 46పనులకు సుమారు *93 లక్షలు మం జూరు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసిం ది. వాస్తవానికైతే ఈ పనుల్ని స్వయం సహా యక సంఘాల ద్వారా పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ అధికారులు చేపట్టాలి. కానీ, స్వయం సహాయక సంఘాల ముసుగులో మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన గ్రామీణ ప్రాంత నేతలకు కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతకు తిలోదకాలిస్తూ హడావుడిగా పను లు చేసేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కోట్లాది రూ పాయల పనుల్ని కాంగ్రెస్ నాయకులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యే లు ఉన్న నిధుల కన్న ఎక్కువ మొత్తంలో ప్రతి పాదనలు పంపిస్తున్నారు. పరిధి మేరకే మం జూరు చేయగలమని అధికారులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతో జెడ్పీ అధికారులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. -
డీఐజీ వచ్చారు
బాధ్యతల స్వీకరణ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం జిల్లాకు పాతవాడినే నూతన డీఐజీ సూర్యనారాయణ నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నిజామాబాద్ డీఐజీ సూర్యనారాయణ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నిజామాబాద్ వచ్చారు. ఆయనకు జిల్లా పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఈసారి జరగబోయే ఎన్నికలు ముఖ్యమైనవన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వహిస్తామని, అందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 2009లో జిల్లా ఎస్పీగా పని చేశానని, జిల్లా గురించి తెలుసునని డీఐజీ అన్నారు. రేంజ్ పరిధిలోని మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ తరుణ్‌జోషి, ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ డీఐజీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను వారు డీఐజీకి వివరించారు. అడిషనల్ ఎస్పీ పాండునాయక్, నిజామాబాద్ నగర సీఐ సైదులు, నగర ఎస్హెచ్ఓ నర్సిం గ్యాదవ్, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్‌రెడ్డి, నగర 3, 4 టౌన్ల ఎస్ఐలు శ్రీహరి, నరేశ్ తదితరులు డీఐజీకి స్వాగతం పలికినవారిలో ఉన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళిక
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి అయిందని వెల్లడించారు. జిల్లాలోని 2,407 పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, మంచి నీళ్లు, టాయిలెట్లు, ర్యాంపుల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలకు ఈ పనుల బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఏడు పోలింగ్ కేంద్రాలకు ఒకరు చొప్పున సెక్టోరల్ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయడానికి యూనిఫాం అధికారులకు బాధ్యతలు అప్పగిస్తాన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్‌తో మాట్లాడుతూ కలెక్టర్ స్మితా సబర్వాల్ పై వ్యాఖ్యాలు చేశారు. అనంతరం ఆమె జిల్లాధికారులతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షకులుగా జిల్లాకు సుమారు 40 మంది సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం పంపించనుందని తెలిపారు. ఎన్నికల ప్రకటన వెల్లడైన వెంటనే ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నిధులు పారలె
నీటిపారుదల ప్రాజెక్టులకు పాత బడ్జెటే జలయజ్ఞంపై చిన్నచూపు ఖర్చుల్లో జీతభత్యాలదే సింహభాగం వివరాల్లేని చిన్న నీటిపారుదల బడ్జెట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో నిలిచిన దశలో.. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జిల్లాకు మోసుకొచ్చిన వరాలేమీ లేవు. ఒకవిధంగా ఇది ఎన్నికల బడ్జెట్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం, ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుంది కాబట్టి కేటాయింపుల విషయంలో పెద్దగా కసరత్తు చేసిన దాఖలాల్లేవన్న అభిప్రాయమూ వ్యక్తమయ్యింది. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ (2014-15)లో జిల్లాకు జరిగిన కేటాయింపులు నివ్వెర పరిచేలా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రమే గత బడ్జెట్ కంటే కొంత మెరుగైన కేటాయింపులు జరిగాయి. సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులను పరిశీలిస్తే ఏమాత్రం మార్పుల్లేకుండా బడ్జెట్ విదిల్చినట్లు కనిపిస్తుంది. నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ-2, తదితర ప్రాజెక్టులకు కేటాయించిన బడ్జెట్ నామమాత్రంగానే ఉంది. పులించింతల ప్రాజెక్టు కేటాయింపుల్లోనూ మార్పులేదు. మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులకు కేటాయింపులపై స్పష్టత లేని కారణంగా, ఆ రెండు రంగాలకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాగార్జునసాగర్‌కు రూ.43కోట్లు అధికం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.700 కోట్లివ్వగా, ఈ బడ్జెట్లో కొద్దిగా పెంచుతూ రూ.743కోట్లు కేటాయించింది. సాగర్ ఆధునికీకరణ పనుల కోసం రూ.4,444 కోట్ల అంచనా వ్యయంతో పనులు ఎప్పుడో మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయి. కానీ, ఆధునికీకరణ పనులు మొదలైనప్పటి నుంచి అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ప్రాజెక్టు నిర్వహణ, ప్రపంచ బ్యాంకు పనులు మొదలుపెట్టక ముందు ప్రారంభించిన పనులు, సిబ్బంది జీతభత్యాలు, కరెంటు చార్జీలు ఇతరత్రా ఖర్చుల కోసం సాగర్ సీఈ పరిధిలో ఈ సారి కేటాయింపులను ప్రకటించలేదు. ఎస్సారెస్పీ -2 తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు సాగునీరు అందించాల్సిన శ్రీరాంసాగర్ (ఎస్ఆర్ఎస్పీ) రెండోదశకు బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకంగానే ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్లో రూ.40కోట్లు మాత్రమే ఇవ్వగా, ఈ సారి బడ్జెట్లోనూ రూ.40కోట్లే కేటాయించింది. రెండోదశ పనులు పూర్తయితే, నాలుగు నియోజకవర్గాల్లో 2.21లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ. 1,043కోట్ల పైచిలుకు అంచనా వ్య యంతో మొదలు పెట్టిన ఈ పనులను సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైనం తగా నిధుల కేటాయింపు మాత్రం ఉండడం లేదు. కేటాయింపుల ఊసే లేని చిన్న నీటి పారుదల రంగం మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్‌కు చేసిన కేటాయింపులపై స్పష్టత లేదు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులైన డిండి, మూసీ ప్రాజెక్టులకు ఎంత కేటాయించారన్న ప్రకటన లేదు. చిన్ననీటి పారుదల విభాగంలోని పిలాయిపల్లి కాల్వ, కోటప్పమత్తడి, బునాదిగాని కాల్వ, శేషులేటి వాగు, వేమూలూరు ప్రాజెక్టు, భీమలింగం, ఆసిఫ్‌నహర్ వంటి ప్రాజెక్టుల కేటాయింపుల ప్రకటన లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 556 (వంద ఎకరాల విస్తీర్ణం పైబడినవి)చెరువులు , 4076 (వంద ఎకరాల విస్తీర్ణానికి లోబడి) కుంటలు ఉన్నాయి. వీటికి కేటాయించిన బడ్జెట్ వివరాలు కూడా అందాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఆ తర్వాత ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో జరిగే కేటాయింపులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినందున పెద్దగా నిరాశపడాల్సిన అవసరం కూడా లేదన్న అభిప్రాయం అధికారవర్గాలు వ్యక్తం చేశాయి. మున్ముందు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున ఆయా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలనూ స్వీకరించలేదని జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీఈ ‘సాక్షి’కి వివరించారు. కాకులను కొట్టి గద్దలకు.. కాకులను కొట్టి గద్దలకు వేసేలా ఈ బడ్జెట్ ఉంది. పరిశ్రమాధిపతులకు, కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేలా కేటాయింపులు జరిగాయి. బడ్జెట్ పరి మాణం పెంచి ప్రజలపై పెనుభారం మోపింది. దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ఏ రకంగా సంక్షేమాన్ని కాపాడుతారు. ఎస్ఎల్బీసీ, ఏఎమ్మార్ ప్రాజెక్టులు, శ్రీరాం సాగర్ రెండు, మూడో దశలు, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాలకు నిర్ణయిం చిన కాలవ్యవధి పూర్తయ్యింది. వీటిని ఇంకెప్పుడు పూర్తి చేశారు? నక్కలగండి ఎత్తిపోతల పథకం కాగితాలకే పరిమితమైంది. - నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రాజెక్టులపై శీతకన్ను సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పటికే నిధులు లేక పనులు మందగించాయి. అప్పుల సంద్రంలో నట్టేట మునిగిన రైతులకు ఇది శరాఘాతమే. చివరకు సంక్షేమ పథకాలపై కూడా శీతకన్ను వేసింది. నాలుగేళ్లుగా చతికిలపడ్డ సంక్షేమ పథకాల అమలు గాడిలో పడే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొండంత బడ్జెట్‌ని చూపిస్తున్నారు. ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారు. అంతేతప్ప సామాన్యుడికి ఊరటనిచ్చే ఒక్క అంశమూ బడ్జెట్లో లేదు. -గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారో స్పష్టంగా చెప్పడం లేదు. కనీసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు లేవు. ప్రణాళికేతర వ్యయాన్నే చూపిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కన్నా అధికంగా పన్నులు పెంచి సామాన్యుల నడ్డి విరగొట్టింది. కనీసం మైనర్ ఇరిగేషన్‌కూ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. - బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఓటర్లకు గాలం వేయడానికే రాబోయే ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులనే సక్రమంగా ఖర్చు చేయలేదు. ఇప్పుడు నిధులను పూర్తిగా ఖర్చు చేస్తారనడం నమ్మశక్యంగా లేదు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా... బడ్జెట్ ఎంత కేటాయించామన్నది కాదు. వాటిని ఖర్చు చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. - బిల్యా నాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎల్బీసీకి అరకొరే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చొరవతో ప్రారంభించిన శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ- టన్నెల్) పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఏ కోశానా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. గత బడ్జెట్లో *420కోట్లు ఇవ్వగా, ఈ సారి కూడా ఒక్క రూపాయి పెంచకుండా అంతే మొత్తం కేటాయించారు. రూ.2813కోట్ల పరిపాలనా అనుమతి ఉన్న ఈ ప్రాజెక్టుకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో 2010లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు 2014వరకు గడువు పెంచారు. అయినా, నిధుల కేటాయింపు నిరాశాజనకంగా ఉండడంతో అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.232కోట్లు ఖర్చు కాగల డిండి ఎత్తిపోతల పథకం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగంగానే ఉంది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం (ఏఎమ్మార్పీ) నిర్వహణ సైతం ఎస్ఎల్బీసీలో అంతర్భాగం. అదే మాదిరిగా రూ.561.96 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కూడా ఎస్ఎల్బీసీలో అంతర్భాగమే. మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు పెద్దమొత్తంలో నిధులు అవసరం పడుతుండగా ప్రభుత్వం కంటి తుడుపుగా రూ.420కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. పులిచింతలకు కాస్త ఊరట పులిచింత ప్రాజెక్టు ద్వారా ముంపు మినహా, జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందే పరిస్థితి లేదు. ముంపు పరిహారం, పునరావాసం విషయంలో మాత్రమే పులిచింతల ప్రాజెక్టు కేటాయింపులకు జిల్లాకు సంబంధం. గత బడ్జెట్లో రూ. 208కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈ సారి అదనంగా మరో రూ.94లక్షలు పెంచి రూ.208.94కోట్లు కేటాయించింది. ఈ నిధులను ప్రాజెక్టు పెండింగ్ పనులు, పునరావాసం, ముంపు పరిహారం కోసం ఖర్చు చేయనున్నారు. -
సమైక్య నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వండి సీబీఐ కోర్టుకు న్యాయవాది వినతి జగన్ పిటిషన్ విచారణార్హం కాదు.. మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ నిర్ణయాన్ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడైన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరచుగా కోర్టు వాయిదాలకు హాజరుకావడం అసౌకర్యంగా ఉందని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని తెలిపారు. జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన న్యాయవాదిగా తాను కోర్టు విచారణకు హాజరవుతానని, జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన సంస్థల్లో పెట్టుబడుల కేసు విచారణకు సంబంధించి జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న హాజరు మినహాయింపు (స్పెషల్ వకాలత్) పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి బుధవారం విచారించారు. జగన్ తరఫున అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుని హాజరు అవసరం లేదని భావించినప్పుడు మినహాయింపు ఇచ్చే అధికారం న్యాయమూర్తికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఉటంకించారు. ప్రస్తుతం కేసు విచారణ అభియోగాల నమోదు దశలోనే ఉందని.. ఈ దశలో జగన్ హాజరు అవసరం లేదని, సీఆర్పీసీ సెక్షన్ 205 ప్రకారం ఆయన హాజరుకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కోర్టు ఎప్పుడు ఆదేశించినా జగన్ హాజరవుతారని నివేదించారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న హెటిరో డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరుకు కోర్టు ఇప్పటికే మినహాయింపు ఇచ్చిందని ప్రస్తావించారు. సీబీఐ తరఫున వాదన వినిపించిన స్పెషల్ పీపీ సురేంద్ర.. జగన్మోహన్రెడ్డికి హాజరు మినహాయింపు ఇవ్వడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం సమన్లు జారీ చేసే కేసుల్లో మాత్రమే హాజరుకు మినహాయింపు ఇస్తారని.. ఇది వారెంట్ కేసు కాబట్టి జగన్ వేసిన పిటిషన్ విచారణార్హం కాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు.. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ మంత్రి గీతారెడ్డి సమర్పించిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయటానికి సీబీఐ గడువు కోరిన నేపధ్యంలో విచారణను కోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.