పనుల మాటున కాంగ్రెస్ నేతల నిధులు పందేరం
జెడ్పీ పనులతో ప్రలోభాలు
ఎస్‌హెచ్‌జీల ముసుగులో కాంగ్రెస్
నాయకులకు కట్టబెడుతున్న వైనం
ఇప్పటికే రూ. కోటీ 70 లక్షల
పనులు ధారాదత్తం
ఎన్నికల వేళ ప్రజావసరాల ముసుగులో కాంగ్రెస్ నాయకులు ‘స్వయం సహాయం’ చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఎన్నికల కోడ్ రాకముందే పనుల మాటున తలకో కొంత ముట్టజెబుతున్నారు. కార్యకర్తలకు, చోటామోటా నేతలకు స్వయం సహాయక సంఘాల ముసుగులో అభివృద్ధి పనులను ్చఅప్పగిస్తున్నారు. తద్వారా కార్యకర్తలకు కొంత ఇవ్వడంతో పాటు పర్సంటేజీల రూపంలో తాము కొంత వెనకేసుకుంటూ...నీకు సగం, నాకు సగం అన్న రీతిలో వ్యవహారాలు సాగిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనుల పందేరాని కి దిగారు. అభివృద్ధి పనులు అప్పగించి గ్రామీణ ప్రాంత నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డా రు. ఇన్నాళ్లూ ఖర్చు చేయని నిధుల్ని యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేస్తున్నారు. తాము సూ చించిన పనులకు నిధులు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ అధికారులకు సిఫారసు చే స్తున్నారు. వాటిని ఎవరికి మంజూరు చేయాలో పరోక్షంగా సూచిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.కోటీ 70లక్షల విలువైన పనుల్ని స్వయం సహాయక సంఘాల ముసుగులో కాంగ్రెస్ నాయకులకు కట్టబెట్టారు. కోట్లాది రూపాయల విలువైన మరికొన్ని పనులు ధారాదాత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 13వ ఆర్థిక సంఘం, స్త్రీ, శిశు సంక్షేమం, స్టేట్ ఫైనా న్స్ కమిషన్, బీఆర్‌జీ తదితర నిధులను నిబంధనల మేరకు ఖర్చుపెట్టాలి. అవసరమైన చోట పనులు మంజూరు చేసి, పంచాయతీరాజ్ ఇం జనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో స్వయం సహాయక సంఘాల ద్వారా పనులు చేపట్టాలి. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా చేస్తున్నారు. రాష్ట్ర విభజన, ప్రజా కంఠక పాలనతో వెల్లువెత్తిన వ్యతిరేకతను నిధుల పందేరంతో నియంత్రించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రజాప్రతి నిధులు వచ్చారు. ఈమేరకు పనుల ప్రలోభ పె డుతున్నారు. ముందుగా జిల్లా పరిషత్‌లో ఉన్న నిధులేంటో తెలుసుకుంటున్నారు. ఎవరికివ్వా లో జాబితాకూడా తయారు చేసుకుంటున్నారు. ఆ మేరకు ప్రాంతాల వారీగా పనులు ప్రతిపాదిస్తున్నారు. జిల్లా పరిషత్ అధికారుల కు తమ లెటర్ ప్యాడ్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు సి ఫారసు చేస్తున్నారు. చెప్పినట్టుగా పనులు మం జూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తమ అనుచరుల్ని నేరుగా జెడ్పీకి పంపిస్తున్నారు. దీంతో జెడ్పీ అధికారులు కాదనలేకపోతున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద *80 లక్షలు విలువైన 50పనుల్ని మంజూరు చేసినట్టు తెలిసింది. అలాగే సాధార ణ, ఆర్థిక సంఘం, స్త్రీ, శిశు సంక్షేమం నిధుల నుంచి 46పనులకు సుమారు *93 లక్షలు మం జూరు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసిం ది. వాస్తవానికైతే ఈ పనుల్ని స్వయం సహా యక సంఘాల ద్వారా పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ అధికారులు చేపట్టాలి. కానీ, స్వయం సహాయక సంఘాల ముసుగులో మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన గ్రామీణ ప్రాంత నేతలకు కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతకు తిలోదకాలిస్తూ హడావుడిగా పను లు చేసేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కోట్లాది రూ పాయల పనుల్ని కాంగ్రెస్ నాయకులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యే లు ఉన్న నిధుల కన్న ఎక్కువ మొత్తంలో ప్రతి పాదనలు పంపిస్తున్నారు. పరిధి మేరకే మం జూరు చేయగలమని అధికారులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతో జెడ్పీ అధికారులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం.
ఎన్నికల వేళ... ‘స్వయం సహాయం’
Published Fri, Feb 21 2014 1:36 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement