1400 ఓటర్లను మించితే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్ అహ్మద్ బాబు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికారులు వివిధ పద్ధతుల ద్వారా ఓటు హక్కు వినియోగం, విలువలపై అవగాహన కల్పిం చాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటు విలువ ప్రతి ఒక్కరికి తెలిసేలా యువజన సంఘాలు, విద్యార్థి, స్వయం సహాయక, శ్రమశక్తి సం ఘాలు, నెహ్రూ యువకేంద్రం, తదితర సం స్థలతో అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు నిబంధనలు తెలుసుకొని విధులు నిర్వర్తించాలని అన్నారు. నూతనంగా జిల్లాలో రెండు లక్షల 20 వేల ఓటర్లు నమోదైనందున వారికి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలన్నా రు.
1400 మంది ఓటర్లకుపైగా ఉన్న పోలిం గ్ కేంద్రాల్లో అదనంగా మరో పోలింగ్ కేం ద్రం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొం టున్నందున 33 కాలమ్స్‌తో తయారు చేసిన ఫ్రొఫార్మా ప్రకారం సిబ్బంది వివరాలు వారం రోజుల్లోగా అందించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ సిబ్బంది కూడా కచ్చితంగా ఓటు వినియోగించుకోవాలన్నారు. అనంతరం వివిధ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. జేసీ లక్ష్మీకాంతం, అదనపు జేసీ రాజు, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఓటుపై అవగాహన కల్పించాలి
Published Tue, Feb 25 2014 1:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
Advertisement