ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడమంటే ఇదేనేమో... మునిసిపల్ ఎన్నికలు
జిల్లాలోని ముఖ్య నేతలకు కష్టకాలం తెచ్చిపెట్టాయి. సాధారణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో ముందుగా వచ్చిన ‘పురపాలక’ సమరం వారి ఖజానాకు ఎసరు పెడుతోంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ :
జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 30వ తేదీన మునిసిపల్, ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నారుు. అరుుతే... సాధారణ ఎన్నికల ముందు అకస్మాత్తుగా వచ్చిన మునిసి‘పోల్స్’ ముఖ్య నేతలకు సవాల్‌గా మారాయి. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీల ఎన్నికలు వారికి అనుకోని తిప్పలు తెచ్చిపెట్టారుు. ఈ పురపాలక సంఘాలు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కీలక నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారుు. ప్రధానంగా నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్ర మంత్రిగా చక్రం తిప్పిన పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్ విప్‌గా కీలకంగా వ్యవహరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవితకు ఈ ఎన్నికలు ఆందోళన కలిగిస్తున్నారుు. నర్సంపేట నగర పంచాయతీ ఎన్నిక రసవత్తరంగా మారగా... పోరుగడ్డ పరకాల టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.
ముందు నురుు్య.. వెనుక గొరుు్య
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న రాజకీయ పార్టీల నేతలు, ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా అంతా చక్కబెట్టుకున్నారు. ఈ క్రమంలో సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మునిపి‘పోల్స్’
వారి ప్రణాళికను దెబ్బతీశాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే నేతలకు మునిసిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి సహకారం అందించేది ఆయూ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులే. ముందుగా మునిసిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో.. వారి ఖర్చు ఎమ్మెల్యే బరిలో ఉన్న అభ్యర్థులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారుు. సాధారణ ఎలక్షన్స్‌పై మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రతి వార్డులో తమకు నమ్మకమైన, పార్టీని బలోపేతం చేయగల వారిని కౌన్సిలర్‌గా గెలిపించుకోక తప్పని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల బరిలో నిలిచిన వారి ఆర్థిక అవసరాలు తీర్చడం వారికి కష్టంగా మారింది.
మునిసిపాలిటీల్లో 28 చొప్పున, నగర పంచాయతీల్లో 20 చొప్పున వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు సాధారణ ఖర్చుల కోసం కనీసం రూ.రెండు లక్షలు భరించినా... సగటున రూ.అర కోటికి చేరుకుంటుండడంతో ఎమ్మెల్యే బరిలో ఉన్న అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఒక వార్డుకు రెండు లక్షల రూపాయలు చిన్న మొత్తమేనని కౌన్సిలర్‌గా పోటీ చేసే వారు చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికల బరిలో దిగుతున్నామని... అన్ని రకాలుగా అండగా నిలవాల్సిందేనని నియోజకవర్గ నేతలకు తెగేసి చెబుతున్నారు. లేకుంటే వేరే దారి చూసుకుంటామని స్పష్టం చేస్తుండడంతో ఎన్నికల ఖర్చు సమస్య నుంచి బయటపడడం నియోజకవర్గ నేతలకు పెద్ద సమస్యగా మారింది. అలా అని పట్టించుకోకుండా ఉందామా అంటే... నెలలోపే జరిగే ఎన్నికల్లో తమకే ఇబ్బందులు వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని... ప్రభుత్వం ఆలస్యంగా ఎన్నికలు పెట్టడం వల్లే ఇలా అయిందని గగ్గోలుపెడుతున్నారు.
జనగామ : పొన్నాల... గట్టెక్కేదెలా
ఎమ్మెల్యేగా పొన్నాల ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామలో మునిసిపాలిటీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత నిలుపుకున్నా... తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు ఆయనను టెన్షన్‌కు గురిచేస్తున్నారుు. పొన్నాల లక్ష్మయ్య 2004 నుంచి మంత్రిగా పనిచేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో 2009 ఎన్నికల్లో అతి కష్టం మీద గట్టెక్కారు... కేవలం 236 ఓట్ల తేడాతో జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2009 మధ్యలో చేసిన అభివృద్ధితో పోల్చితే... ఈ ఐదేళ్లలో చేసింది తక్కువనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు సాధారణ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇలాంటి తరుణంలో 37 వేల మంది ఓటర్లు ఉన్న జనగామ మునిసిపాలిటీకి అసెంబ్లీ కంటే ముందుగా ఎన్నికలు రావడంతో దీని ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన పొన్నాలలో నెలకొంది.
భూపాలపల్లి : గండ్రకు ‘తొలి’ గండం
ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇటీవలి వరకు కీలకంగా వ్యవహరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి తాజా రాజకీయ పరిస్థితులు తలనొప్పిగా మారారుు. దీనికి తోడు కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీకి తొలి ఎన్నికలు కావడం... వాటి ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందనే అంచనా ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. నియోజకవర్గంలో 40 వేల మంది ఓటర్లు ఉన్న పట్టణం కావడంతో వారి తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కవితకు మహబూబా‘బాధ’
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవితకు మహబూబాబాద్ మునిసిపాలిటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారారుు. ఇటీవలే మునిసిపాలిటీగా మారిన మహబూబాబాద్ తెలంగాణ ఏర్పాటుతో జిల్లా కేంద్రంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. పట్టణంలో 40 వేల ఓటర్లు ఉండగా.... అధికార పార్టీ ఎమ్మెల్యేగా కవితపై ఉన్న వ్యతిరేకత, సానుకూలత ఈ ఎన్నికల్లో వెల్లడికానుంది.
నర్సంపేట : త్రిముఖ పోటీ
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సంపేటలో మునిసిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నారుు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీడీపీ దయనీయ పరిస్థితుల్లో ఉందనే అభిప్రాయం ఉంది. మరోవైపు తెలంగాణను సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు జిల్లాలో ముఖ్య నాయకుడిగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. 24 వేల ఓటర్లు ఉన్న మునిసిపాలిటీ ఎన్నికల ఫలితం సుదర్శన్‌రెడ్డికి ఎలాంటి అనుభవాన్ని మిగల్చనుందో తేలాల్సి ఉంది. నర్సంపేట కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న దొంతి మాధవరెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సైతం నర్సంపేట నగర పంచాయతీ ఫలితం మాధవరెడ్డికి కీలకం కానుంది. 20 వేల ఓటర్లు ఉన్న పరకాల నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి ప్రతిష్టాత్మకంగా మారారుు.
లబ్‌డబ్బు..
Published Fri, Mar 7 2014 3:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement