ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే
సర్వ సన్నద్ధంగా అధికార యంత్రాంగం
ఇప్పటికే రెండుసార్లు సమీక్ష జరిపిన భన్వర్‌లాల్
అన్ని పరిస్థితులపై దృష్టి సారించిన జిల్లా అధికారులు
గత ఎన్నికల పరిణామాలపైనా ఆరా
ఈవీఎంల భద్రత కోసం రూ.98.93 లక్షలు
నేడో రేపో రానున్న అదనపు పోలీసు బలగాలు
సమస్యాత్మక ప్రాంతాలలో మోహరింపు
ఓట్ల పండుగ కోసం అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అంశాలనూ పరిశీలిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ గురించే కాకుండా శాంతిభద్రతలపైనా దృష్టి సారిస్తున్నారు. గత అనుభవాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులనూ, సిబ్బందిని నియమించిన ఉన్నతాధికారులు వారికి ఎప్పటికప్పుడు తగు సూచనలూ, సలహాలు అందజేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
సార్వత్రిక ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారయంత్రాంగం సన్నద్ధమైంది. సుమారు18 లక్షల పైచిలుకు ఓటర్ల కోసం 2,005 పోలింగ్ కేంద్రా లు, 4,010 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీ ఎంలు) సిద్ధం చేశారు. ఈ నెల 14 వరకు జిల్లాలో మూడేళ్లకు పైబడిన అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ముగించిన ఉన్నతాధికారు లు, బదిలీపై వచ్చిన వారికి ఎన్నికల విధులు కేటాయించారు. ఈ వారంలో రెండుసార్లు వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల ను సమీక్షించారు. కాగా, ఎన్నికల నిర్వహణకు రెండు రోజులలో అదనపు పోలీసు బలగాలు జిల్లాకు రానున్నాయి. ఈవీఎంల భద్రత కోసం నిర్మించిన గోదాములకు రూ.98.93 లక్షలు విడుదల చేస్తూ జీఓఆర్‌టీ నం.773 ద్వారా భన్వర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 18,04,664 మంది ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందు లో అత్యధికంగా 9,31,911 మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పా టు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే సున్నిత, అతి సున్నిత గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు వీడియో రికార్డింగ్, వెబ్ కాస్టిం గ్, లైవ్ కాస్టింగ్‌ల ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షిం చేందుకు ఐఐఐటీ విద్యార్థులను వినియోగించుకునే అవకాశాలను కూడా సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో అక్రమ మద్యం, డబ్బు రావడానికి వీలు లేకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు పాయింట్లను గుర్తించారు. ప్రతి నియోజకవర్గానికి రిట ర్నింగ్ అధికారితో పాటు ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు. జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన సంకేతాలున్నాయని తెలుస్తోంది.
2009 ఎన్నికల నివేదికల పరిశీలన
సాధారణంగా ఎన్నికలలో చెదురు మదురు సంఘటన లు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2009 సార్వత్రిక ఎన్నికల పరిణామాలపైనా జిల్లా కలెక్టర్, ఎస్‌పీ పరిశీలన జరిపినట్లు తెలిసింది. ఆ ఎన్నికల లో చోటు చేసుకున్న ఘర్షణలు, నమోదైన కేసులపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులలో అదనపు పోలీసు బలగాలు రానున్నాయి. వీటిని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలలో మోహరిం చే విషయమై కసరత్తు చేసినట్లు సమాచారం. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మకంగా మారిన గ్రామాలపైనా సమీక్ష జరిపి పోలింగ్ సందర్భంగా నిఘా పెంచే ప్రయత్నంలో ఉన్నారు.
2009 ఎన్నికల సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలపై ఇండియన్ పీనల్ కోడ్ కింద 57 కేసులు నమోదయ్యాయి. ఈసారి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో లెసైన్సుడు ఆయుధాలు కలిగిన పలువురి జాబితాను సిద్ధం చేసిన అధికారులు,నోటిఫికేషన్ విడు దల కాగానే వారి ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.
జిల్లా పరిస్థితి ఇది
అసెంబ్లీ నియోజకవర్గాల 9
మొత్తం ఓటర్లు 18,04,664
మహిళలు 9,31,911
పురుషులు 8,72,753
పోలింగ్ కేంద్రాలు 2,005
సిద్ధం చేసిన ఈవీఎంలు 4,010
మేము రెడీ
Published Wed, Feb 26 2014 2:22 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement
Advertisement