ఇదీ.. ఈవీఎం పనితీరు | performance of evm's | Sakshi
Sakshi News home page

ఇదీ.. ఈవీఎం పనితీరు

Published Fri, Apr 25 2014 3:27 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

ఇదీ.. ఈవీఎం పనితీరు - Sakshi

ఇదీ.. ఈవీఎం పనితీరు

 సాక్షి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలివి (ఈవీఎంలు). ఫొటోలో కనిపిస్తున్న రెండింటిలో ఎడమవైపుది కంట్రోలింగ్ యూనిట్ (సీయూ). కుడివైపుదిబ్యాలెట్ యూనిట్ (బీయూ). ఎన్నికల కేంద్రంలోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది.

 ఓటర్లుబీయూలో ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటరుఓటు వేయడానికి వెళ్లినప్పుడు అధికారి సీయూలోని‘బ్యాలెట్’ బటన్‌ను నొక్కితే.. ఓటరు వద్ద నున్నబ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేసేందుకు వీలవుతుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి.ఒకవేళ అంతకంటే ఎక్కువ  గుర్తులు (అభ్యర్థులు)బరిలో ఉంటే.. మరో యంత్రాన్ని వినియోగిస్తారు.

అభ్యర్థులు పదిమంది కంటే తక్కువ మంది ఉంటే.. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. అంతమంది అభ్యర్థుల గుర్తులు మాత్రమే ఉండేలా సాంకేతిక చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకుపదిమంది అభ్యర్థులు పోటీలో ఉంటే పది బటన్లు(గుర్తులు) మాత్రమే పనిచేసేలా చేస్తారు.

 ఈసారిఎన్నికల్లో ‘పై వారిలో ఎవరూ కాదు’ (నోటా) బటన్ కూడా ఉంటుంది. ఇది అభ్యర్థులందరిగుర్తుల కంటే దిగువన ఉంటుంది. ఎన్నికల అధికారిసీయూలో బ్యాలెట్ బటన్‌ను నొక్కగానే ఓటువేసేందుకు వెళ్లిన పౌరుడి వద్ద ఉన్న బీయూలోని ‘రెడీ’ బల్బు వెలుగుతుంది. వెనువెంటనే సీయూలోని ‘బిజీ’ బల్బు వెలుగుతుంది.

 బీయూలోనిఅభ్యర్థుల గుర్తుల్లో తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కితే.. ఓటింగ్ పూర్తయినట్లు. ఎన్నిక పూర్తికాగానే బిజీ బల్బు ఆగిపోతుంది. అప్పుడు మరో ఓటరును పంపించి ఎన్నికల అధి కారి ‘బ్యాలెట్’ బటన్‌ను నొక్కుతారు. అప్పుడు మరొకరు ఓటు వే సేందుకు వీలవుతుంది.
 
 ఎరుపు రంగులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్నభాగం ‘డిస్‌ప్లే’. సదరు ప్రాంతంలో ఎంతమంది ఓట్లు వేసింది ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దిగువన నీలిరంగులో చతురస్రాకార భాగాలున్న ప్రాంతాన్ని ‘క్యాండ్‌సెట్ యూని  ట్’గా వ్యవహరి స్తారు. వీటిని రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో పోలింగ్‌కు ముందుగా తగిన విధంగా సెట్ చేస్తారు.
 
 

 

 

 

ఈవీఎంలపై ఆయా రాజకీయ పార్టీల సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు వీలుగా మాక్‌పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్‌పోలింగ్ సందర్భంగాఆయా పార్టీల అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తులపైఓట్లు వేసి.. తర్వాత పోలైన ఓట్లతో.. ఏయే గుర్తులకుఎన్ని ఓట్లు పడ్డాయో పోల్చి చూసుకోవచ్చు.నీలిరంగు మూతలు తెరిస్తే.. ‘క్లోజ్, రిజల్ట్,ప్రింట్, క్లియర్’ అనే బటన్లు కనిపిస్తాయి. ఆయాసూచికలు సదరు పనులు  చేస్తాయి. ‘రిజల్ట్’బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని  ఓట్లు వచ్చాయోతెలుస్తుంది. ఇవన్నీ రిటర్నింగ్ అధికారులు నిర్వహించే పనులు కాగా, రాజకీయ పార్టీల అనుమానాలు తొలగించేందుకు మాక్‌పోలింగ్‌లో వీటి ద్వారా ఈవీఎంల పనితీరు తెలియజేస్తారు.
 
 ఇవి సీయూ,బీయూల వెనుకవైపు చిత్రాలు ఇందులోని ‘క్యూసీ’క్వాలిటీచెక్ జరిగిందని తెలిపేది. ఈవీఎంతయారీ సంస్థ ఈసీఐల్ ప్రతినిధి, జిల్లా ఎన్నికల అధికారి ప్రతినిధి ఈవీఎంల పనితీరు, క్వాలిటీని
 ధ్రువీకరిస్తూ సంతకాలు చేస్తారు.
 
 

 

 

 

 

అవగాహన ఏదీ?
 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరో పది హేను రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తిగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను వాడనున్నారు. ఈసారి ఈవీఎంలలో కొత్తగా రెండు ఆప్షన్లను ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది.

అందులో ఒకటి నోటా (నన్ ఆఫ్ దీ ఎబో). ఎన్నికల బరిలో నిల్చిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరిస్తూ ‘నోటా’ బటన్ నొక్కవచ్చు. ఇక రెండోది వీవీపాట్ (ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్). దీని ద్వారా తమ ఓటు సక్రమంగా నమోదయ్యిందా? లేదా..? అనే విషయం తెలుసుకునేందుకు రశీదు పొందవచ్చు.

 ఓటర్లకోసం ఎన్నికల సంఘం ఈ సారి ఈ కొత్త ఆప్షన్లను ప్రవేశపెట్టింది. కాని వీటిపై ఓటర్లకు, రాజకీయ పార్టీలకు, ఎన్నికల సిబ్బందికి సైతం సరైన అవగాహన లేదనే చెప్పొచ్చు.  ఇప్పటి వరకు వీటి వినియోగంపై ఎక్కడా అవగాహన కల్పించ లేదు.
 
 చర్యలు శూన్యం...
 గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎంలో ఏదో ఒక బటన్ నొక్కి ఓటువేయడం మాత్రమే తెలుసు. ఇప్పుడున్న కొత్త ఆప్షన్ల గురించిగాని, వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంగానీ తెలియదు. వీటిపై అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదు.

మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు బ్యాలెట్ పేపర్లపైనే ఓటు వేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించి వాటిలోనూ కొత్త ఆప్షన్లు పెడితే ఎలా తెలుస్తాయనేది చాలా మందిలో ఉన్న సందేహం. దాన్ని నివృత్తి చేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement