సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లావ్యాప్తంగా ఉదయం ఏడు గటలకు పోలింగ్ మందకొడిగా మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్ద జనం పలుచగా కనిపించారు. తొమ్మిది గంటల తర్వాత వేగం పుంజుకుంది. సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తంగా 72 శా తం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 16 మంది, జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి 12 మంది అభ్యర్థు లు, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 101 మంది పోటీ చేశారు. జిల్లాలో మొత్తం 18,53,288 మంది ఓటర్లు ఉండగా, తొమ్మిది నియోజకవర్గాల్లో ని 2,057 పోలింగ్ కేంద్రాలలో 5,332 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను ఏర్పాటు చేశారు.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలోని పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో 13 కేంద్రాలలో పోలింగ్‌కు అంతరాయం కలి గింది. ఒక్కోచోట 15 నిముషాల నుంచి గంట వరకు పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఈవీఎంల మొరాయింపు కారణంగా బోధన్ మండలంలోని మినార్‌పల్లిలో 45 నిమిషాలు, కుమ్మన్‌పల్లిలో గంట పాటు పోలింగ్ నిలిచింది. నవీపేట మండల కేంద్రంలోని 181,182 కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. గంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రెంజల్ మండల కేంద్రంలోని 135 పోలింగ్ కేంద్రం, ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్, ఆర్మూర్ పట్టణంలోని 65వ నెంబర్ పోలింగ్ కేంద్రం తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మద్నూ ర్, మారెపల్లి, సింగితం, బిచ్కుంద, పుల్కల్, వాజిద్‌నగర్, రాజాపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సింగితంలో రెండున్నర గంటలు పోలింగ్ నిలిచిపోయింది. ఆర్మూర్ పట్టణంలోని 65వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల అధికారులు కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారు.
జిల్లాలో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పర్యవేక్షించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, సాటాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తరుణ్ జోషి పరిశీలించారు. నందిపేట మండలంలోని ఆంధ్రా నగర్‌లో హోటల్ మూసి వేయాలని కానిస్టేబుల్ సురేశ్ బూతులు తిట్టడంతో గ్రామస్తులు అతనిపై చేయి చేసుకున్నారు. తోటి పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మోర్తాడ్ మండలం శెట్‌పల్లికి చెందిన వెన్ను లక్ష్మీబాయి(60) అనే వద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మృతి చెందారు. కామారెడ్డి మండలంలోని శాబ్ధిపూర్, గూడెం గ్రామాలలో మధ్నాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ పూర్తయింది. గూడెంలో 84 శాతం, శాబ్దిపూర్‌లో 85 శాతం పోలింగ్ నమోదైంది.
స్ట్రాంగ్‌రూముల్లో అభ్యర్థుల భవితవ్యం
పోలింగ్ ముగియగానే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సీజ్ చేసి ఒకే చోటకు చేర్చారు. అనంతరం ఉన్నతాధికారుల పరిశీలన పూర్తయ్యాక ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్యన డిచ్‌పల్లి సమీపంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) ఆవరణలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. మే16న ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న నిజామాబాద్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓట్లు వేసుకున్నారు. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించినప్రజలు, నిర్వహించిన అధికారులకు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి అభినందనలు తెలిపారు.
ఓటేశారు
Published Thu, May 1 2014 3:08 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement