Voting ended
-
బెంగళూరులో పెరిగిన ఓటింగ్ శాతం
-
బరితెగించిన దామచర్ల
సాక్షి, ఒంగోలు సిటీ: టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ బరితెగించారు. గురువారం ఉదయం ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రాత్రివేళ పోలింగ్ సమయం మించిపోయినప్పటికీ ఓటర్లను అనుమతించాలంటూ పోలింగ్ అధికారులపై రుబాబు చేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్సు సమీపంలో గల అగ్జిలియం స్కూలు వద్ద జరుగుతున్న ఈ విషయం గురించి తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. దామచర్ల, అతని వర్గీయులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులను కూడా దామచర్ల తనవైపు తిప్పుకోవడంతో డీఎస్పీలు రాధేష్ మురళి, శ్రీనివాసాచారి అత్యుత్సాహం ప్రదర్శించారు. దామచర్లకు దాసోహమై వైఎస్సార్ సీపీ నాయకులపై మాత్రమే విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారు. టీడీపీ నాయకులను మాత్రం బుజ్జగిస్తూ పక్కకు పంపి తీవ్ర విమర్శల పాలయ్యారు. దామచర్ల, టీడీపీ నాయకులతో పాటు డీఎస్పీల తీరుతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గురువారం అర్ధరాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది. అసలేం జరిగిందంటే... ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్సు సమీపంలో అగ్జిలియం స్కూలు ఉంది. ఇక్కడ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముందుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తన అనుచరుల ద్వారా ఆ సమీపంలోని ముస్లింలను ప్రలోభాలకు గురిచేశారు. బుధవారం రాత్రి వీలు కాకపోవడంతో డబ్బు పంచలేకపోయామని, ఇప్పుడు డబ్బులిస్తామని, వెళ్లి టీడీపీకి ఓటేయాలని ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా అగ్జిలియంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఒక బూత్‌లో టీడీపీ ఏజెంటు లేడని, పోలింగ్ ఆపాలని అధికారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బెదిరిపోయిన పీవో పోలింగ్ ఆపారు. అక్కడే తిష్టవేసి ఇష్టారాజ్యంగా దామచర్ల వ్యవహరించడంతో సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ నాయకులు కాకుమాను రాజశేఖర్, శింగరాజు వెంకట్రావు, ధూళిపూడి ప్రసాద్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో దామచర్ల పోలింగ్ కేంద్రంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీలు రాథేల్‌మురళి, శ్రీనివాసాచారిలు అక్కడికి చేరుకున్నారు. బాలినేని, దామచర్ల, వారి వర్గీయులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దామచర్ల, అతని వర్గీయులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, పోలింగ్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, ఇక్కడి నుంచి వారు వెళ్తేనే తాము కూడా వెళ్తామని బాలినేని, అతని అనుచరులు స్పష్టం చేశారు. పోలీసుల ఒత్తిడితో ఇద్దరు నాయకులతో పాటు వారి అనుచరులు బయటకు వచ్చి వాహనాలు తీశారు. అయితే, దామచర్ల, అతని అనుచరులు వారి వాహనాలను బాలినేని వాహనాలకు అడ్డంగా ఉంచి పక్కకు తీసే అవకాశం ఉన్నా తీయకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్ సీపీ నాయకులపై మాత్రమే లాఠీచార్జి... బాలినేని, దామచర్ల, వారి వర్గీయులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో డీఎస్పీలు, పోలీసులు లాఠీచార్జికి దిగారు. సమస్య వచ్చింది దామచర్ల కారణంగా అని, వారిని ముందుగా పంపించాలని బాలినేని వారిస్తున్నా వినిపించుకోకుండా వైఎస్సార్ సీపీ నాయకులపై మాత్రమే పోలీసులు లాఠీలతో దాడి చేశారు. తీవ్ర అసభ్యకర పదజాలంతో మహిళలపై సైతం విరుచుకుపడ్డారు. గొడవ ముదురుతుందని భావించిన దామచర్ల, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రివేళ మళ్లీ ఉద్రిక్తత... గురువారం రాత్రి స్థానిక వెంకటేశ్వరకాలనీలో దామచర్ల జనార్దన్ సోదరుడు సత్య పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టారు. ఓటర్లకు డబ్బులిస్తున్నట్లుగా బాలినేనికి సమాచారం అందడంతో తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ సత్య అనుచరులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో సత్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ అగ్జిలియం వద్ద దామచర్ల జనార్దన్ పీవోతో గొడవ పడుతున్నారని సమాచారం అందడంతో బాలినేని వెంటనే అక్కడికి వెళ్లారు. పోలింగ్‌కు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లను అనుమతించాలని పీవోపై దామచర్ల ఒత్తిడి చేస్తున్నారు. సమయంలోగా స్లిప్పులు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తామని పీవో తెలిపారు. ఆ సమయంలో బాలినేని వెళ్లడంతో ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. రాత్రి పోలింగ్ అయ్యేంత వరకు అగ్జిలియం వద్దనే రెండువర్గాలు తిష్టవేశాయి. పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఉద్రిక్తత మధ్యే పోలింగ్ జరిగింది. -
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. -
పోలింగ్‌లో ప్రోబ్లమ్స్..
ఖమ్మంఅర్బన్/కామేపల్లి/పాల్వంచ : నగరంలోని బల్లేపల్లిలోని 36వ పోలింగ్ స్టేషన్‌లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఉదయం పూట మొరాయించింది. దీంతో ఎన్నికల అధికారులు మరో ఈవీఎం ఏర్పాటు చేశారు. అది కూడా మొరాయించింది. మళ్లీ ఇంకోటి తెచ్చి బిగించాక..రెండు గంటలకు పైగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైయింది. దీంతో..అంతసేపు ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. బల్లేపల్లిలో అత్యధికంగా ఓట్లు ఉన్న బూత్ కూడా ఇదే కావడంతో వందలాది మంది క్యూకట్టారు. వికలాంగులు ఇబ్బంది పడ్డారు. రఘునాథపాలెంలోని 31వ నంబర్ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ప్యాడ్ పని చేయకపోవడంతో ఇక్కడా ఆలస్యమైంది. చింతగుర్తిలోని 22 పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో లోపం తలెత్తి ఓట్ల నమోదు నెమ్మదించింది. వృద్ధులు అంతసేపు క్యూలో నిలుచోలేక ఆరుబయట కుప్పలపై కూర్చోవాల్సి వచ్చింది. వేపకుంట్లలోని 61వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం అంతరాయంతో ఆరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్‌తోపాటు, అదనంగా ఓటు ఎవరికి వేసింది చూసుకోనే విధంగా ఏర్పాటు చేసిన ఈవీఎం ప్యాడ్‌తో పోలింగ్ పక్రీయ చాలా ఆలస్యంగా కొనసాగడంతో తక్కువ ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో సైతం గంటల తరబడి ఉండటంతోపాటు, క్యూకట్టి చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. కామేపల్లి మండలంలోని పండితాపురం, కొత్తలింగాలలో అర్ధగంట పాటు ఈవీఎంలు మొరాయించగా, మద్దులపల్లిలో గంటున్నర పాటు ఈవీఎం పనిచేయలేదు. కామేపల్లిలో కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇక్కడ రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పాల్వంచ పట్టణంలోని రాతి చెరువు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 46 ఓట్లు పోల్ అయిన తర్వాత ఈవీఎం మొరాయించింది. ఇక్కడ గంట పాటు పోలింగ్ నిలిచింది. తహసీల్దార్ రవికుమార్ పరిశీలించి, కొత్తది ఏర్పాటు చేయించాక పోలింగ్ ప్రారంభమైంది. -
ఓటేశారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లావ్యాప్తంగా ఉదయం ఏడు గటలకు పోలింగ్ మందకొడిగా మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్ద జనం పలుచగా కనిపించారు. తొమ్మిది గంటల తర్వాత వేగం పుంజుకుంది. సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తంగా 72 శా తం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 16 మంది, జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి 12 మంది అభ్యర్థు లు, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 101 మంది పోటీ చేశారు. జిల్లాలో మొత్తం 18,53,288 మంది ఓటర్లు ఉండగా, తొమ్మిది నియోజకవర్గాల్లో ని 2,057 పోలింగ్ కేంద్రాలలో 5,332 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను ఏర్పాటు చేశారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలోని పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో 13 కేంద్రాలలో పోలింగ్‌కు అంతరాయం కలి గింది. ఒక్కోచోట 15 నిముషాల నుంచి గంట వరకు పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఈవీఎంల మొరాయింపు కారణంగా బోధన్ మండలంలోని మినార్పల్లిలో 45 నిమిషాలు, కుమ్మన్పల్లిలో గంట పాటు పోలింగ్ నిలిచింది. నవీపేట మండల కేంద్రంలోని 181,182 కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. గంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రెంజల్ మండల కేంద్రంలోని 135 పోలింగ్ కేంద్రం, ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్, ఆర్మూర్ పట్టణంలోని 65వ నెంబర్ పోలింగ్ కేంద్రం తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మద్నూ ర్, మారెపల్లి, సింగితం, బిచ్కుంద, పుల్కల్, వాజిద్నగర్, రాజాపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సింగితంలో రెండున్నర గంటలు పోలింగ్ నిలిచిపోయింది. ఆర్మూర్ పట్టణంలోని 65వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల అధికారులు కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారు. జిల్లాలో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పర్యవేక్షించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, సాటాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తరుణ్ జోషి పరిశీలించారు. నందిపేట మండలంలోని ఆంధ్రా నగర్లో హోటల్ మూసి వేయాలని కానిస్టేబుల్ సురేశ్ బూతులు తిట్టడంతో గ్రామస్తులు అతనిపై చేయి చేసుకున్నారు. తోటి పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన వెన్ను లక్ష్మీబాయి(60) అనే వద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మృతి చెందారు. కామారెడ్డి మండలంలోని శాబ్ధిపూర్, గూడెం గ్రామాలలో మధ్నాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ పూర్తయింది. గూడెంలో 84 శాతం, శాబ్దిపూర్‌లో 85 శాతం పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్‌రూముల్లో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగియగానే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సీజ్ చేసి ఒకే చోటకు చేర్చారు. అనంతరం ఉన్నతాధికారుల పరిశీలన పూర్తయ్యాక ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్యన డిచ్పల్లి సమీపంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) ఆవరణలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. మే16న ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న నిజామాబాద్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓట్లు వేసుకున్నారు. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించినప్రజలు, నిర్వహించిన అధికారులకు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి అభినందనలు తెలిపారు.