‘ధనుష్’ సందడి
ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో ముగిసిన ధనుష్ 2కె15
సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేసిన విద్యార్థులు
గంగూరు(పెనమలూరు) : గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రోజులు జరిగిన ధనుష్ 2కె15 సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమంలో పలు ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు సందడి చేశారు. విద్యార్థులు తమ మేధస్సుతో రూపొందించిన వివిధ మోడల్స్‌ను ప్రదర్శించారు. సాంకేతిక అంశంలో పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్‌జామ్ తదితర కార్యక్రమాలు చేశారు. ఇక మోడల్ ప్రెజెంటేషన్‌లో గ్రీన్ సిటీ, ఆధునాతన వంతెనల రూపకల్పన, సోలార్, ఇంధన వనరులు ఆదాకు యంత్రాల తయారు ఇలా అనేక మోడల్స్ రూపొందించి ప్రదర్శించారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు సందడి చేశారు. డ్యాన్స్‌లు, పాటలు, భరత నాట్యం, పెయింటింగ్, మిమిక్రీ, గ్రూప్ డ్యాన్స్ ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. పలు కాలేజీ విద్యార్థులు పోటాపోటీగా డాన్స్‌లు వేశారు.
విద్యార్థులు శ్రమించాలి
విద్యార్థులు శ్రమిస్తేనే మంచి ఫలితాలు సాధిస్తారని కాకినాడ జేఎన్‌టీయూ డెరైక్టర్ డాక్టర్ పి.ఉదయ్‌భాస్కర్ చెప్పారు. కాలేజీల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంద న్నారు. విద్యార్థులు కూడా నూతన సాంకేతిక విజ్ఞానంపై దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కడియాల రవి పాల్గొన్నారు.