Ganguru
-
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
‘ధనుష్’ సందడి
ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో ముగిసిన ధనుష్ 2కె15 సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేసిన విద్యార్థులు గంగూరు(పెనమలూరు) : గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రోజులు జరిగిన ధనుష్ 2కె15 సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమంలో పలు ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు సందడి చేశారు. విద్యార్థులు తమ మేధస్సుతో రూపొందించిన వివిధ మోడల్స్‌ను ప్రదర్శించారు. సాంకేతిక అంశంలో పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్జామ్ తదితర కార్యక్రమాలు చేశారు. ఇక మోడల్ ప్రెజెంటేషన్‌లో గ్రీన్ సిటీ, ఆధునాతన వంతెనల రూపకల్పన, సోలార్, ఇంధన వనరులు ఆదాకు యంత్రాల తయారు ఇలా అనేక మోడల్స్ రూపొందించి ప్రదర్శించారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు సందడి చేశారు. డ్యాన్స్‌లు, పాటలు, భరత నాట్యం, పెయింటింగ్, మిమిక్రీ, గ్రూప్ డ్యాన్స్ ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. పలు కాలేజీ విద్యార్థులు పోటాపోటీగా డాన్స్‌లు వేశారు. విద్యార్థులు శ్రమించాలి విద్యార్థులు శ్రమిస్తేనే మంచి ఫలితాలు సాధిస్తారని కాకినాడ జేఎన్టీయూ డెరైక్టర్ డాక్టర్ పి.ఉదయ్‌భాస్కర్ చెప్పారు. కాలేజీల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంద న్నారు. విద్యార్థులు కూడా నూతన సాంకేతిక విజ్ఞానంపై దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కడియాల రవి పాల్గొన్నారు.