హాస్యబ్రహ్మకు నివాళి | Comedian Dharmavarapu Subramanyam Passes Away | Sakshi
Sakshi News home page

హాస్యబ్రహ్మకు నివాళి

Published Mon, Dec 9 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

హాస్యబ్రహ్మకు నివాళి

హాస్యబ్రహ్మకు నివాళి

 అద్దంకి, న్యూస్‌లైన్: సినీ హాస్యనటుడు, సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయం ఆదివారం రాత్రి అద్దంకిలోని ఆయన స్వగృహానికి చేరింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో  బాధపడుతున్న సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఆయన పార్థివదేహానికి సోమవారం ఉదయం 11.30 గంటలకు మండలంలోని శింగరకొండపాలెం సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన అన్న ధర్మవరపు సీతారామయ్య తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయం అద్దంకి చేరగానే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికంగా ఉన్న స్నేహితులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement