addamki
-
బాపట్ల జిల్లా అద్దంకిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
అద్దంకిలో లోకేష్ ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన కార్యకర్తలు
-
104వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 104వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. సోమవారం ఉదయం ఆయన అద్దంకి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం తక్కెళ్లపాడు చేరుకుంటారు. అక్కడ జనంతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. ఆ తర్వాత నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదగా యాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,398.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
పీఎఫ్ కార్యాలయం ఆఫీసర్ ఇన్చార్జిగా అద్దంకి
కాకినాడ సిటీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కేంద్ర శ్రామిక మంత్రిత్వశాఖ చేపట్టిన సరళీకృత విధానంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన జిల్లా పీఎఫ్ కార్యాలయం ప్రథమ ఆఫీసర్ ఇ¯ŒSచార్జిగా అద్దంకి అమరేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ సభ్యుల సేవలు విస్తృతం చేసేందుకు, ఉద్యోగుల పీఎఫ్ సభ్యత్వం నమోదు పెంచేందుకు, పీఎఫ్ బకాయిలు వసూలు చేసేందుకు త్వరలో రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ నుంచి అదనపు సిబ్బందిని ఇక్కడ కాకినాడ పీఎఫ్ ఆఫీస్‌కు బదలాయిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, సంస్థ యజమానుల సేవలకు, పీఎఫ్ సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా కాకినాడ పీఎఫ్ కార్యాలయం విస్తరణ జరుగుతుందన్నారు. పీఎఫ్ పెన్ష¯ŒSదారులు ఆధార్ లింక్‌లో వారిలో జీవన ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని కోరారు. -
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం వేకువజామున 2.43 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అద్దంకి, సంతనూతలపాడు, కొరిశపాడు, మేదరమెట్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ చాలాసార్లు ప్రకాశం జిల్లాలో భూమి కంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దర్శిలో బూచేపల్లి, అద్దంకిలో గొట్టిపాటి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. -
'ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత బాబుది'
ఒంగోలు : ఓటు వేసే ముందు ఒక్కసారి వైఎస్ఆర్ను గుర్తుకు తెచ్చుకోవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల శనివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యటించారు. షర్మిలకు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రైతులను రాజులా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. వైఎస్ఆర్ రైతుల పక్షపాతి అని,ఆయన హయాం...రైతుల పాలిట స్వర్ణయుగమని ఆమె గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదలకు పెద్ద చదువులు అందయని షర్మిల తెలిపారు. చంద్రబాబు 16లక్షల మందికి పింఛన్లు ఇస్తే... వైఎస్ఆర్ 71లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని షర్మిల అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ సర్కార్ వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిందని ఆమె మండిపడ్డారు. పిల్లనివ్వటమే కాకుండా, రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘటన చంద్రబాబుదన్నారు. హార్స్ పవర్ ఛార్జీని రూ.50 నుంచి 600 చేసిన ఘనుడు చంద్రబాబు అని షర్మిల ధ్వజమెత్తారు. మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకుందామని షర్మిల అన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కుర్చోవాలో మనమే నిర్ణయిద్దామని ఆమె అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నూతన అధ్యాయం నిర్మించుకుందామని, ప్రజల సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసి...మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని షర్మిల పిలుపునిచ్చారు. -
కన్నుల పండువగా తెప్పోత్సవం
అద్దంకి, న్యూస్‌లైన్ : సంక్రాంతి సందర్భంగా శింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆలయ వేదపండితులు షోడపోచార.. రాజోపచార.. సకలోపచార పూజలు చేశారు. అనంతరం ఉభయ దేవతామూర్తులను వసంత మండపం వద్దకు తీసుకెళ్లి మంగళవాయిద్యాలతో వేదస్వస్తి, హరెరామనామ సంకీర్తనలతో ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం స్వామివార్ల పల్లకీని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య భవనాశి చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కుంభం పోసి కూష్మాండబలి ఇచ్చి స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన పడవలో భవనాశి చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు వంగల శివశంకరావధాని మాట్లాడుతూ తెప్పోత్సవాన్ని వరుసగా 49 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కనుమ సందర్భంగా ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమణమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసు పహారాలో అద్దంకి
అద్దంకి, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదుచేశారు. తమపై దాడిచేసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల ఫిర్యాదు మేర కు రెండు కేసులు, టీడీపీ నేతల ఫిర్యాదుతో మరో కేసు, పోలీస్ కానిస్టేబుల్‌పై దాడిచేసి తల పగులగొట్టినందుకు మరో కేసు నమోదు చేసినట్లు సీఐ బాలసుందరావు తెలిపారు. తెలుగుదేశం నాయకుడు కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ ప్రధాన నిందితులుగా కేసులు నమోదయ్యాయి. వీరందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. కాగా దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ సారథ్యంలో బుధవారం రాత్రి నుంచి అద్దంకిలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో ఫ్లెక్సీలు చించివేయడమే వివాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో ఫ్లెక్సీలన్నింటినీ తొలగించారు. మూడు గంటల్లోనే -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి
అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్లెక్సీ వివాదం బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. దాంతో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. అద్దంకి భవాని సెంటర్ ఉన్న టిడిపి నేత కరణం బలరాం ప్లెక్సీ చించారంటూ టిడిపి కార్యకర్తలు... వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దాడి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులు గొట్టిపాటిని బలవంతంగా అక్కడనుంచి తరలించారు. మరోవైపు అద్దంకిలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగినప్పటికీ పోలీసులు పహరా కాస్తున్నారు. -
నవ్వుల రేడుకు కన్నీటి వీడ్కోలు
అద్దంకి, న్యూస్‌లైన్: ఊపిరితిత్తుల కేన్సర్‌తో హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం అద్దంకి మండలం శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. ధర్మవరపు భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ సందర్శించి నివాళులర్పించారు. ధర్మవరపు భార్య కృష్ణజ, కుమారులు రోహన్ సందీప్, బ్రహ్మతేజలను ఓదార్చారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌హౌస్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, ఏపీ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యుడు ఈదా శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సంది రెడ్డి రమేష్, నగర పంచాయతీ కమిషనర్ టీ వెంకటకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మవరపు కుమారుడు రోహన్ సందీప్ ఆయన చితికి నిప్పంటించారు. అంతిమయాత్ర సమయంలో ఆయన అభిమానులు పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. -
హాస్యబ్రహ్మకు నివాళి
అద్దంకి, న్యూస్‌లైన్: సినీ హాస్యనటుడు, సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయం ఆదివారం రాత్రి అద్దంకిలోని ఆయన స్వగృహానికి చేరింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఆయన పార్థివదేహానికి సోమవారం ఉదయం 11.30 గంటలకు మండలంలోని శింగరకొండపాలెం సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన అన్న ధర్మవరపు సీతారామయ్య తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయం అద్దంకి చేరగానే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికంగా ఉన్న స్నేహితులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
గుండ్లకమ్మకు భారీగా వరదనీరు, 10గేట్లు ఎత్తివేత
ఒంగోలు : ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వరద నీరు పొటెత్తింది. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు చెందిన పది గేట్లను ఎత్తివేశారు. దిగువకు 85వేల క్యూసెక్కుల వదర నీటిని దిగువకు విడుదల చేశారు. మద్దిరాలపాడు బ్రిడ్జి వద్ద 15 అడుగులకుపై నీరు ప్రవహిస్తోంది. దాంతో ఒంగోలు-చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్లికురవ బలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు మార్టురులోనూ భారీ వర్షం కురుస్తోంది. లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరద నీరు చేరటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక యద్దనపూడి మండలంలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలకు నీట మునిగిన అద్దంకి ఎన్టీఆర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ పర్యటించి, బాధితుల్ని పరామర్శించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ విజయ్ కుమార్ భారీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.