అద్దంకి, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదుచేశారు. తమపై దాడిచేసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల ఫిర్యాదు మేర కు రెండు కేసులు, టీడీపీ నేతల ఫిర్యాదుతో మరో కేసు, పోలీస్ కానిస్టేబుల్‌పై దాడిచేసి తల పగులగొట్టినందుకు మరో కేసు నమోదు చేసినట్లు సీఐ బాలసుందరావు తెలిపారు.
తెలుగుదేశం నాయకుడు కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ ప్రధాన నిందితులుగా కేసులు నమోదయ్యాయి. వీరందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. కాగా దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ సారథ్యంలో బుధవారం రాత్రి నుంచి అద్దంకిలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో ఫ్లెక్సీలు చించివేయడమే వివాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో ఫ్లెక్సీలన్నింటినీ తొలగించారు.
మూడు గంటల్లోనే
పోలీసు పహారాలో అద్దంకి
Published Fri, Jan 3 2014 1:38 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement