ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫెక్సీ వివాదం బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది.
అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్లెక్సీ వివాదం బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. దాంతో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. అద్దంకి భవాని సెంటర్ ఉన్న టిడిపి నేత కరణం బలరాం ప్లెక్సీ చించారంటూ టిడిపి కార్యకర్తలు... వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
దాడి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకి-నార్కెట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులు గొట్టిపాటిని బలవంతంగా అక్కడనుంచి తరలించారు. మరోవైపు అద్దంకిలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగినప్పటికీ పోలీసులు పహరా కాస్తున్నారు.