నేటి నుంచి టీకాలు | Commissioner of Family Welfare Orders For Immune vaccines | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీకాలు

Published Sat, Apr 18 2020 3:29 AM | Last Updated on Sat, Apr 18 2020 3:29 AM

Commissioner of Family Welfare Orders For Immune vaccines - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గతకొన్ని రోజులుగా గర్భిణులకు, చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు ఆగిపోయాయి. శనివారం నుంచి ఆ టీకాలు యథావిధిగా వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం రోటావైరస్, డీపీటీ, తట్టు, పోలియో తదితర వ్యాక్సిన్‌లు ఇస్తారు. నేటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయాలన్నారు.

టీకాలు ఇలా వేయాలి..
► టీకాలు వేయాల్సిన వాళ్లందరినీ గుర్తించాలి
► వారిలో అరగంటకు నలుగురుకి చొప్పున స్లాట్‌లు ఇవ్వాలి
► ఆశా కార్యకర్తల ద్వారా ముందురోజే ఈ స్లాట్‌ సమయం స్లిప్పులు ఇవ్వాలి
► గ్రామ, వార్డు పరిధిలోని లబ్ధిదారులందరికీ టీకాలు వేసే వరకూ స్లాట్లను కొనసాగించాలి
► ఏఎన్‌ఎంలు గానీ, ఆశాలు గానీ, అంగన్‌వాడీ వర్కర్‌గానీ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే టీకాల్లో పాల్గొనకూడదు
► రెడ్‌జోన్‌ (కంటైన్‌మెంట్‌ జోన్‌) ప్రాంతాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించకూడదు
► టీకాలకు వచ్చే వారి మధ్య కనీసం 7 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలి
► టీకాలు వేసే ఏఎన్‌ఎం సర్జికల్‌ మాస్కు ధరించడంతో పాటు టీకా వేసేముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement