
పార్లమెంట్ భవనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)పై పార్లమెంటులో సమగ్ర చర్చ జరుగుతుందని కేంద్ర హొం శాఖ తెలిపింది. రాష్ట్ర శాసనసభకు పంపింది ముసాయిదా బిల్లు మాత్రమేనని ఆ శాఖ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హొం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
పార్లమెంటులో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అని కూడా ఆ లేఖలో తెలిపింది. తుది బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని వివరించింది. బిల్లుపై చర్చ విషయంలో అసెంబ్లీలో వివాదం నెలకొన్న నేపధ్యంలో కేంద్ర హొం శాఖ ఈ వివరణ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.