కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు | Congress confirm MLC candidates for Nominated kota | Sakshi
Sakshi News home page

కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు

Published Wed, Feb 12 2014 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు

కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు

న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు నిలిచినప్పటికీ పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది.

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి పేరు కూడా వినిపించినప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే నాలుగో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని ఎవరికి కట్టబెడతారనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఆశావహలు నాలుగో సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement