Nominated MLCs
-
ఏపీ: నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల చేసిన ఈసీ
సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషన్ బుధవారం నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులను విడుదల చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్నికల కమిషన్ సీఈవో తెలిపారు. ఈ మేరకు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, కొయ్యే మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌ను ఎమ్మెల్సీలుగా ప్రకటించింది. చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు -
గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ లేఖ
వివాదస్పద నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్సీల నామినేషన్ల వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్సీలుగా తాను సూచించిన నలుగురి పేర్లను ఆమోదించాల్సిందిగా లేఖలో సీఎం కిరణ్ కోరారు. సీఎం సూచించిన నలుగురి పేర్లలో మూడింటికి ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం సూచించిన నాలుగవ అభ్యర్థి రఘురాం రెడ్డిని పక్కన పెట్టారు. తాను సూచించిన రఘురామిరెడ్డి పేరును ఆమోదించాల్సిందిగా సీఎం లేఖలో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన పేర్లను కాకుండా సీఎం కిరణ్ తన సన్నిహితుల పేర్లను సూచించారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు నిలిచినప్పటికీ పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి పేరు కూడా వినిపించినప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే నాలుగో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని ఎవరికి కట్టబెడతారనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఆశావహలు నాలుగో సీటుపై ఆశలు పెట్టుకున్నారు.