ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
కేంద్ర కార్మిక సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన డిమాండ్లపై చర్చించి ఆమోదించకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు, ఉద్యోగులు కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెబుతారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు హెచ్చరించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు కనీస వేతనంగా 12,500 రూపాయలు చెల్లించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో పార్లమెంట్‌కు సంఘీభావంగా సీఐటీయూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 20, 21 తేదీల్లో జరిగిన సార్వత్రిక సమ్మెకు స్పందించిన ప్రధానమంత్రి.. ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రులతో కమిటీ వేశారన్నారు. 10 నెలలు గడుస్తున్నా.. ఆ కమిటీ తన పనిపూర్తి చేయలేదని విమర్శించారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక బిల్లులను వెంటనే ఆమోదించే కేంద్ర ప్రభుత్వం.. ప్రయోజనం కలిగించే బిల్లులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతుందన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర కార్మిక సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన డిమాండ్లపై చర్చించి ఆమోదించాలన్నారు. లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీ వెంకట్రావు, నాయకులు జీ కోటేశ్వరరావు, కే శ్రీనివాసరావు, పాపని సుబ్బారావు, కేవీ శేషారావు, ఎస్‌డీ హుస్సేన్, ఉంగరాల శ్రీను, యాసిన్, రాపూరి శ్రీనివాసరావు, ఎస్.కోటేశ్వరరావు, తంబి శ్రీనివాసులు, సీహెచ్ రమాదేవి, ఎల్‌ఐసీ, ఆర్టీసీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్‌అండ్‌బీ, మెడికల్ రిప్స్, మున్సిపాలిటీ, సివిల్ సప్లయిస్ ముఠా, కాాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు బుద్ధిచెబుతాం
Published Fri, Dec 13 2013 2:53 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement