విజయనగరం మున్సిపాలిటీ:ఏపీఈపీడీసీఎల్ అధికారులు నిరంతరం విద్యు త్ సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 2 నుం చి ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు సన్నద్ధ మవుతున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న విద్యు త్ కనెక్షన్‌లలో వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు వేర్వేరుగా ఫీడర్‌లు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు.తద్వారా గృహావసర విద్యు త్ కనెక్షన్‌లకు 24 గంటల పాటు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు ఏడు గంటల పాటు సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం చేపట్టే పనులకు రూ. 107. 29 కోట్ల అవసరమని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబుకు ప్రతిపాదించారు. జిల్లాలో మొ త్తం 6 లక్షల 30 వేల 404 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 31,816 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా రుు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లతో పాటు గృహవసర విద్యుత్ కనెక్షన్‌లకు ఒకే ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉండే వి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అధిక లోడు వినియోగించడంతో విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కడి చిన్నపాటి అ వాంతరం తలెత్తినా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అధికారులు కోతలు విధించేవారు. ఈ సమస్యను గుర్తించి న అధికారులు రెండు ఫీడర్‌లను వేరు చేయడం ద్వా రా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు కార్యచరణ రూపొందించారు.
ప్రత్యేక ఫీడర్‌ల ఏర్పాటు
జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు ఏడు గంటల పాటు, గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక ఫీడర్‌లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో రెండింటి అనుసంధానంతో ఇప్పటివరకు మొత్తం 146 ఫీడర్లు ఉండగా...అందులో ఆర్‌ఈసీఎస్ పరిధి లో 10 ఫీడర్లు, పూసపాటిరేగ మండలంలో 11 ఫీడర్లు, ఐటీడీఏ పరిధిలో ఉన్న మూడు ఫీడర్లతో పాటు జియ్యమ్మవలస, గంట్యాడ, కొమరాడ, మెట్టవలస, కుమరాం, మాదలింగి ప్రాంతాల్లో ఆరు ఫీడర్లను విభజిం చారు. దీంతో మిగిలిన 116 ఫీడర్లను వేరే చేసేందుకు మొత్తం రూ.107.29 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,472 కిలోమీటర్ల మేర 11కెవి హెచ్‌టీలైన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే 383 కిలోమీటర్ల మేర 6.3 కెవి లైన్ లు, ప్రస్తుతం 6.3కెవి గా ఉన్న 80 కిలోమీటర్ల విద్యుత్ లైన్‌ను 11 కెవి కెపాసిటీకి పెంచనున్నారు.
100 కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు రెండు, 63 కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఆరు, 40 కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు 142, 25కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్‌ఫార్మర్‌లు 415, 16కెవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు 774, 15కెవి సింగిల్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్ మరో 332 ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 13 రైల్వేక్రాసింగ్ పాయింట్‌ల వద్ద 470 మీట ర్ల మేర అండర్ గ్రౌం డ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 131.89 కిలోమీటర్ల పొడవున త్రి ఫేజ్ ఫోర్ వైర్‌లైన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మరికొన్ని నూతన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అరుుతే ఈ పనులన్నింటికి జిల్లాకు రూ.107.29 కోట్లు అవసరమని గుర్తించగా.. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలో ఈ తరహాలో పనులు చేపట్టేందుకు సుమారు రూ.600 కోట్ల వరకు అవసరముంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో నిధు లు వెచ్చించి విద్యుత్ ఆధునికీకరణ పనులు చేపట్టడం పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రా ష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో ఈ తరహా అభివృద్ధి పనులు ఎంతవరకు సా ధ్యపడతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిరంతర విద్యుత్ సాధ్యమేనా...?
Published Wed, Jul 16 2014 4:10 AM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM
Advertisement
Advertisement