భద్రతతోనే నాణ్యమైన సేవలు | Safety Quality Services | Sakshi
Sakshi News home page

భద్రతతోనే నాణ్యమైన సేవలు

Published Wed, Jun 8 2016 9:26 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Safety Quality Services

 విజయనగరం మున్సిపాలిటీ: విద్యుత్ సరఫరాలో ఉద్యోగులు, సిబ్బంది భద్ర తా ప్రమాణాలు పాటించడం ద్వారానే వినియోగదారులకు నాణ్యమైన సేవలందించగలమని విద్యుత్ శాఖ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, సేఫ్టీ డైరె క్టర్ జె.పద్మజనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనం ఆవరణలోని సమావేశ మందిరంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో గల డీఈలు, ఏడీఈలు, ఏఈల తో పాటు  దిగువ స్థాయి జేఎల్‌ఎంల వరకు విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఉద్యోగులకు పరిశోధనాత్మకంగా వివరించారు. ప్రధానంగా ఐఎస్‌ఐ మార్క్ పరికరాలు వాడ టం ద్వారా ప్రమాదాలను నిరోధించవచ్చని, అత్యంత ప్రమాదకమైన వ్యవస్థలో నాణ్యమైన పరికరాలు వినియోగించేందుకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కే సమయంలో తగు జాగ్రత్తలు పాటించటంతో పాటు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రమాదాలకు తావిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవస్థను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ జి.చిరంజీవిరావు, టెక్నికల్ ఎల్.దైవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement