కలిసుంటే... కాసులపంటే.. | Coordination error Between the two department | Sakshi
Sakshi News home page

కలిసుంటే... కాసులపంటే..

Published Fri, Nov 7 2014 4:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Coordination error Between the two department

సాక్షి, విజయవాడ : రెండు శాఖల మధ్య సమన్వయ లోపం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని చెబుతున్నారు. మరోవైపు ‘టెంపుల్ టూరిజం’ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ  శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ప్రకటించారు. అయితే, పర్యాటక, దేవాదాయ శాఖల మధ్య సమన్వయలోపం వల్ల పాల కుల ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయి. కీలకమైన కార్యక్రమాలను ఎవరికి వారే వేర్వేరుగా నిర్వహించుకుంటున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రెండు శాఖలు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడంలేదు.  రెండు శాఖల అధికారులు కలిసి కార్యక్రమాలు రూపొందిస్తే కాసుల పంట పండుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వచ్చినా...
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రోజూ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చూడదగిన ప్రదేశాల వివరాలు తెలియజేసేందుకు దేవాదాయ, పర్యాటక శాఖలు  చర్యలు తీసుకోవడంలేదు. కొం దరు భక్తులు దుర్గగుడి అధికారులను అడిగినా పర్యాటక శాఖ ప్యాకేజీలు తమకు తెలియవని బదులిస్తున్నారు. దీంతో భక్తు లు అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోతున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు, తమ శాఖ ప్యాకేజీల గురించి వివరిస్తే వాటిని తిలకిం చాలని భక్తులకు ఆసక్తి గలిగే అవకాశం ఉంటుంది.   ఇతర రాష్ట్రాల భక్తులు పర్యాటక శాఖ ఆధ్వర్యాన పర్యటిస్తున్న సమయంలో దుర్గగుడి వివరాలు అడిగినా చె ప్పడం లేదని తెలుస్తోంది. ఈ రెండు శాఖ లు పరస్పరం సహకరించుకుం టే ఆదా యం భారీగా పెరిగే అవకాశం ఉంది.

దుర్గగుడిని కలుపుతూ ప్యాకేజీ లేదు
రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం అయిన దుర్గగుడిని కలుపుతూ పర్యాటక శాఖ ఏ విధమైన ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటి వరకు రూపొందించలేదు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయంలో ఎంతోమంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు. ఆ సమయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనంతోపా టు కృష్ణా, గుంటూరు జిల్లాలోని ముఖ్య దేవాలయాలను సందర్శించే విధంగా పర్యాటక శాఖ ప్యాకేజీలు తయారు చేయవచ్చు.

కార్తీక మాసంలోనూ అంతే..
కార్తీకమాసంలో ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పంచారామాలకు భక్తులను తీసుకెళ్తుంది. పర్యాటక శాఖ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. భవానీ ద్వీపానికి ఇతర ప్రాంతాల నుంచి వనభోజనాలకు వచ్చే భక్తుల్లో చాలా తక్కువ మంది మాత్రమే దుర్గగుడికి వెళ్తున్నారు. వీరు దుర్గమ్మను దర్శించుకునేలా పర్యాటక శాఖ కార్యక్రమాలు రూపొం దించే అవకాశం ఉంది.
 
గదులు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు...
దుర్గగుడికి వచ్చే భక్తులకు రూముల కొరత తీవ్రంగా ఉంది. నగరంలో హోటళ్లలో దిగి అమ్మవారి దర్శనానికి రావాల్సి వస్తోంది. భవానీ ద్వీపంలో, పున్నమి గార్డెన్స్‌లోని పర్యాటక శాఖ రూములు ఖాళీగా ఉంటున్నాయి. ఈ రెండు శాఖల మధ్య సమన్వ యం ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా రూమ్‌లు సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
 
కాగితాలకే పరిమితమైన రోప్‌వే
పర్యాటక శాఖ ఆధ్వర్యాన సీతమ్మవారి పాదాల నుంచి దుర్గగుడికి రోప్ వే ఏర్పాటుకు ప్రతిపాదనలు అర్ధ శతాబ్దంగా ఉన్నా యి. దుర్గగుడికి వచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది. రెండు శాఖల మధ్య సమన్వ యం లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికైనా రెండు శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement