ఒంగోలు: ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని గోపాల్ నగర్‌కు చెందిన వ్యక్తికి నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చింది. అనారోగ్యంతో నెల్లూరులో చికిత్స కోసం చేరాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అధికారులు కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలకు స్వాబ్‌ను తీసి పంపించడంతో పాజిటివ్‌గా నిర్ధారణయింది. సమాచారం తెలుసుకున్న ప్రకాశం జిల్లా అధికారులు బాధితుని ఇంటికి చేరుకుని అనుమానితులను క్వారంటైన్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 42 పాజిటివ్ కేసులు
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 42గా నమోదయ్యాయి. అనుమానిత వ్యక్తుల నుంచి ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో మంగళ వారం 13 నివేదికలు నెగటివ్‌గా నిర్ధారణయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లాలో 949 శాంపిల్స్ సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు. వీటిలో 694 నివేదికలు అందాయి. వీటిలో 41 పాజిటివ్ కాగా, 653 కేసులు నెగటివ్‌గా నిర్ధారణయ్యాయి. నెల్లూరులో నమోదయిన ఒంగోలు కేసుతో కలిపి పాజిటివ్‌ల సంఖ్య 42కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment