నిజామాబాద్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: మూడు, నాలుగు రోజులుగా కార్పొరేషన్ అధికారులు నగరంలో తిరుగుతూ నిరాశ్రయుల వివరాలను సేకరిస్తున్నారు.సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఏ నీడా లేనివారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘షెల్టర్ ఫర్ హోం లెస్’ నిర్వహణ బాధ్యతను నగర, పురపాలక సంస్థలకు అప్పగించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నగరాలలో వాడకుండా వదిలేసిన ప్రభుత్వ భవనాలు, సామాజిక భవనాలను నివాసయో గ్యంగా తీర్చిదిద్ది అభాగ్యులకు వసతి కల్పిస్తారు. అలాంటి భవనాలు లేకపోతే కొత్తవాటిని నిర్మిస్తారు. వీటిలో తాగునీరు, స్నానం గదులు, మరుగుదొడ్లను ఏర్పాటు చే స్తారు. భోజన వసతి కూడా కల్పిస్తారు.
నిర్వహణకు కమిటీలు
షెల్టర్ల నిర్వహణకు కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలకు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ కమిషనర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఎంహెచ్‌ఓ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మెప్మా పీఆర్‌పీలు, మహిళా సంఘాలకు చెందిన పట్టణ సమాఖ్యల బాధ్యులు, ఎన్జీఓలతో కూడిన పదిమంది సభ్యులతో కార్యనిర్వా హక కమిటీ ఉంటుంది. ఒక్కో వసతి గృహంలో 50 మందికి సరిపడా వసతులు కల్పించేందుకు ప్లేట్లు, బకెట్లు, దుప్పట్లు, మంచాలు కొనుగోలు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం రూ. 3.50 లక్షలు ఖర్చు చేయనుంది. భోజన వసతులకు ఏడాదికి రూ. 9.42 లక్షలు కేటాయించనున్నారు. ఇందుకోసం అయ్యే వ్యయంలో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. వసతి గృహంలో ఇద్దరు కేర్ టేకర్లను నియమించి ఒక్కొక్కరికి రూ.5000 వేతనాలు చెల్లిస్తారు.
నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలో రాత్రి వేళలో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్, రైల్వేబ్రిడ్జి కింది, పార్కులలో ఉన్న వారి వివరాలను సేక రి స్తున్నారు. ఇప్పటి వరకు 90 మంది వివరాలు సేకరించామని, నగరం మొత్తం సర్వే చేసి నిరాశ్రయులను గుర్తిస్తామని అన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పం పిస్తామని అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి మల్లికార్జున్ తెలిపారు. జనాభా లక్షకు పైగా ఉన్న నగరాలు, పట్టణాలలో ఎస్‌యూహెచ్ పథకాన్ని అమలు చేయనున్నటు ఆయన తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
నిర్భాగ్యులకు వసతి
Published Sun, Dec 1 2013 4:34 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement