సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతోంది. మూడేళ్లుగా పాలకవర్గం లేదు. ఆరు నెలలుగా అడిషనల్ కమిషనర్ మంగతాయారు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కార్పొరేషన్‌కు వస్తున్న ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, మెయింటెనెన్స్‌కు సరిపోవడం లేదు. ఆస్తిపన్ను, ఇతరత్రా వనరుల ద్వారా ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయం వస్తుండగా, టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ. కోటి మించడం లేదు. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సొంతంగా నగర పాలక సంస్థకు నిధుల లేమి ఉంది. ఆదాయ వనరులను పెం చుకోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేని పరిస్థితిలో ఈ సంస్థ కొట్టుమిట్టాడు తోంది. దీనికి తగ్గట్టుగానే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించుకొని పలువురు ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఈ రేటు ప్రకారం ముడుపులు ముట్టజెప్పనిదే మున్సిపల్ కార్పొరేషన్‌లో పను లు జరగడం కష్టంగా మారింది. పైరవీకారులకు,బడాబాబులకు నిలయంగా పనులు సాగుతున్నాయి. పేదలు నివసించే కాలనీలలో సమస్యలు పేరుకుపోతున్నాయి. వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఇక్కడనే పాతుకుపోయా రు. నేతల అండదండలతో వారు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. దీంతో నగర పాలక సంస్థ అభివృద్ధి కుంటు పడుతోంది. నగరపాలక సం స్థ టౌన్‌ప్లానింగ్ విభాగం అక్రమాలకు నిల యంగా మారింది. ఏటా నగరంలో కొత్త భవనాల నిర్మాణాలు వందలాదిగా పెరుగుతున్నప్పటికీ కార్పొరేషన్‌కు వస్తున్న ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. బహుళ అంతస్తులు, వ్యాపార, వాణిజ్య సముదాయా లు పెరుగుతున్నాయి. బడాబాబులు యథేచ్ఛ గా కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతున్నారు. అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపడుతున్నారు. విషయం అధికారులు, ఉద్యోగులకు తెలి సినప్పటికిని పర్సంటేజీలతో సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.నగరంలోని పూసలగల్లీలో 50 ఫ్లాట్లతో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిం చారు. ఇక్కడ పార్కింగ్ కోసం విడిచిపెట్టాల్సిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా 33 షాపులను నిర్మించినప్పటికీ పట్టించుకున్న దాఖ లా లు లేవు. ఇందులో నివాసముంటున్న కుటుం బాలు ఈ విషయమై ఎన్నో పర్యాయాలు స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు చేశారు. స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిని కూడా కలిసి వారి బాధను మొరపెట్టుకున్నారు. హైకోర్టును ఆశ్రయించి న్యా యాన్ని పొందారు. అయినప్పటికీ బహుళ అంతస్తులో షాపింగ్ కాంప్లెక్స్‌గా నిర్మించిన 33 షాపులను తొలగించడానికి నగర పాలక సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ బిల్డర్‌కు కొందరి నేతల అండదండలు ఉం డడంతో పాటు పెద్ద మొత్తంలో నగర పాలక సంస్థ అధికారులకు ముడుపులు ముట్టడంతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
వినాయక్‌నగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న బ హుళ అంతస్తులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 15 మంది యజమానులకు నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అదనపు చర్యలను చేపట్టలేకపోతున్నారు. సరైన డ్రైనేజీలను నిర్మించకుండా, రోడ్లు వేయకుండా బహుళ అంతస్తులను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయని ఆయా ప్రాం త కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నగరంలోని పలు కాల నీ ల్లో నెలకొంటున్నప్పటికీ కార్పొరేషన్ అధికారు లు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. డ్రైనేజీలు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు అక్రమించి భవన నిర్మాణా లు చేపట్టినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న భవనాలపై అధికారులు దృష్టి సా రించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
కార్పొరేషనా.. మజాకా!
Published Tue, Dec 24 2013 3:11 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement